దవ సారి నామినేషన్ దాఖలు చేశాను. రాజకీయంగా జన్మనిచ్చి విదేశాల్లో గుర్తింపు నిచ్చింది. సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను. 15 ఏండ్ల గా అవినీతి రహితంగా పని చేసినం సిరిసిల్ల ముఖ చిత్రం మార్చిన పల్లెలు పచ్చ బడ్డాయి. వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న మీ బిడ్డగా రాష్ట్ర స్థాయి లో గౌరవం పెరిగింది. అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాను. గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్నగులాబి దండు నాకు అండగా ఉంది. ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్న 55 ఎండ్లు అధికారం. ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారు. సంక్షేమం అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా ఒకే ఒక గొంతుకను అనిచి వేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడు మనకు. మనకు ఏమన్న ఉంటే మనం మనం పరిష్కరించు కుందం ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకనాటి సామంత రాజ్యంగా కావాలా కరెంటు కావాలా. కాంగ్రెస్ కావాలా నీళ్ళు కావాలా.. కన్నీళ్లు కావాలా.. స్కాములు కావాలా సబ్బండ వర్ణాల అభ్యున్నతికి బి ఆర్ ఎస్‌కు ల మత పిచ్చి గాల్లను గెలిపిద్దమ్మ ఆలోచించండి. జిల్లా తెచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం నేతన్నల తలరాతలు మార్చాం ప్రలోబాలకు లొంగీ పతే ఆగం ఐతం గతంలో తప్పు చేస్తే మళ్ళీ 50 ఎండ్లు బడపడ వలసి వస్తది మళ్ళీ డిల్లీ మొచేతు నీళ్ళు తాగే పరిస్తితి వస్తది. సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలు సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని విశ్వాసం ఉంది.
కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఫుల్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఆయా నియోజకవర్గాలల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేలా ప్రచారం చేస్తున్నారు. ప్రణాళికలో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు రెండు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు భారీ బహిరంగ సభలను ఆయా నియోజకవర్గాల్లోని గులాబీ నేతలు ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ మొదటగా మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసగింస్తారు. సాయంత్రం షాద్‌నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొననున్నారు.
Read Also..
Read Also..
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. ఎన్నికల సిబ్బంది పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు వాహనాన్ని పోలీసులు ఆపారు. తూప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో.. తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు కేటీఆర్. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డికి బయలుదేరారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో 5 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. కర్ణాటకలో తమ పరిస్థితి ఎలా ఉందనేది చూసేందుకు అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేతిలో దగా పడ్డ రైతులే తెలంగాణకు వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. సమస్యలతో సతమతమవుతున్న కర్ణాటక రైతులను గాలికి వదిలేసి తెలంగాణలో ఓట్ల వేటకు వచ్చిన డీకే శివకుమార్ ను రెండు రాష్ట్రాల రైతులు క్షమించరని కేటీఆర్ చెప్పారు. ఐదు హామీలంటూ అరచేతిలో వైకుంఠం చూపించి, తీరా గద్దెనెక్కిన తర్వాత కొర్రీల మీద కొర్రీలు పెడుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. అన్న భాగ్య స్కీమ్ అటకెక్కిందని, గృహజ్యోతి పథకం ఆరిపోయిందని ఆరోపించారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ను కర్ణాటక క్షమించదు.. తెలంగాణ విశ్వసించదని కేటీఆర్ స్పష్టం చేశారు. రేషన్ పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పాన్ని, కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని కాంగ్రెస్ అసమర్థ పాలనకు మధ్య తేడాను తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని కేటీఆర్ అన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామన్నారు. రుణాల మొత్తాన్ని సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు. 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అన్నారు. 9 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు. పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ 24 వేలు ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందన్నారు. తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నారు. ఐటీలో హైదరాబాద్, బెంగళూరును మించిపోయిందన్నారు.




Total views : 148600