అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే పదిన్నరకు ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఏపీ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఖరారు చేస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. కేంద్రం ప్రభుత్వం సూచనతో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీతో పాటు కేంద్రానికి పంపే తీర్మానానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక ఏపీలో వివిధ రంగాలపై యుద్ద ప్రభావంపై ప్రత్యేకంగా శాఖల వారీగా చర్చించనున్నారు. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తత పలు రంగాలపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హోటల్స్ మూసివేసిన పరిస్థితేర్పడింది. దీంతో గ్యాస్ సిలిండర్ల సమస్యకు శాశ్వత పరిష్కారంపై చర్చించనుంది మంత్రివర్గం
Tag:





Total views : 77212