తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు సంబంధించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. రెండోదశలో భాగంగా మొత్తం 122.9 కిలోమీటర్ల మేర విస్తరణ, 7 కారిడార్లు, 86 మెట్రో స్టేషన్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 38 వేల 595 కోట్లు గా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన భాగస్వామ్యంతో చేపట్టేలా అనుమతులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణపై ప్రధానంగా చర్చించారు.
ఏప్రిల్ 30, 2026 నాటికి మెట్రో ఫేజ్-1ను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత జరుగుతున్న ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కె. రఘువీర్ రెడ్డి తదితరులు సీఎంతో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు.
Tag:






Total views : 75189