నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పెట్రోల్ కొరత వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. గత వారం రోజులుగా వాహనదారులకు పెట్రోల్, డీజిల్ అందటం లేదు. అధికారులు కొరత లేదని చెబుతున్నా బంక్ లలో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. భైంసాలో మొత్తం 5 పెట్రోల్ బంకులు ఉండగా నాలుగు బంకుల్లో పెట్రోల్ ,డీజిల్ కొరత ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్రోల్ కోసం రిలయన్స్ బంకులో రద్దీ ఉంటుంది. డీజిల్ కొరత వల్ల ట్రాక్టర్లు లేక వ్యవసాయ పనులు ముందుకు సాగటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tag: