మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్ లో పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై కొందరు బ్లేడ్‌తో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇందిరానగర్‌కు చెందిన మంద సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి ఓ వైన్స్‌లో మద్యం సేవించి బయటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది .ఆ సమయంలో చిలుకానగర్ వైపు నుంచి బైక్‌పై వచ్చిన జాన్, పవన్ తో పాటు మరికొందరు సాయి కుమార్‌ను అడ్డగించి వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో సాయి కుమార్ ఎదురుతిరగగా జాన్ తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్‌ను తీసి సాయి కుమార్ మెడపై దాడి చేసినట్లు తెలుస్తుంది. దాడిలో సాయి కుమార్ మెడకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అతడిని వెంటనే బోడుప్పల్ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పాత కక్షలే దాడికి కారణమని తెలుస్తోంది .దాడికి పాల్పడిన పవన్,, బాధితుడు సాయి కుమార్ ఇద్దరు బోడుప్పల్ ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన వారే. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Tag:




Total views : 92788