తెలంగాణ(Telangana) టెన్త్ ఫలితాలు(10th Results) విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 5.05 లక్షల మంది హాజరు కాగా, ఉత్తీర్ణత 91.31 శాతంగా నమోదైంది. ఇక తాజాగా విడుదలైన ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. 93.23 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత 89.42 శాతం. 99.05 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్‌లో ఉంటే.. 65.10 శాతం ఉత్తీర్ణత సాధించిన వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. కాగా పదవతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు కూడా అధికారులు ఖరారు చేశారు. జూన్ 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
- తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు రోల్ సభలు నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు సభల రూపంలో జరిగే ఈ కార్యక్రమాల్లో బూత్ స్థాయి అధికారులు…
- భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా పర్యటన ప్రణాళిక లేదని విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిందని కిషన్‌రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి రాకముందే రేవంత్‌రెడ్డి విదేశీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.