గత సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. గత సంవత్సరం నుండి 2000 నోట్లు బ్యాంకు ఖాతాల్లో ఖాతాదారులు డిపాసిట్ చేస్తూనే ఉన్నారు. ఈ 2000 రూపాయల నోట్లకు సంబంధించి రిజర్వు బ్యాంకు తాజాగా అప్డేట్ ఇచ్చింది. అందులో 100% రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటికీ బ్యాంకులో జమ కాలేదని పేర్కొంది. 2000 డినామినేషన్‌తో కూడిన కొన్ని నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇప్పుడు కొన్ని కోట్ల విలువైన నోట్లు మాత్రమే బ్యాంకులకు రావాల్సి ఉందని వెల్లడించింది. గత ఏడాది మే 19న రూ.2000 డినామినేషన్ బ్యాంకు నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ నోట్లను మార్చుకునే సదుపాయం ఇప్పటికీ రిజర్వ్ బ్యాంకుకు చెందిన కొన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉంది.
ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు అక్టోబర్ 9, 2023 నుండి వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2,000 నోట్లను వారి బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి. ఇది కాకుండా, ప్రజలు దేశంలోని ఇండియన్ పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఏదైనా ఇష్యూ కార్యాలయానికి కూడా రూ.2,000 నోట్లను పంపవచ్చు. ఈ డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 199313