తెలంగాణ మూడో శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళసై ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో ప్రమాణం చేయించారు. అల్లా సాక్షిగా అక్బరుద్దీన్ తన బాధ్యతలు నిర్వహిస్తానంటూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మంత్రులు డి.శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టికల్ 178 ప్రకారం శాసనసభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకూ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ సేవలందిస్తారంటూ గవర్నర్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. అసెంబ్లీలో అందరికంటే సీనియర్ సభ్యుడు కావడంతో అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు దక్కాయి. నేడు జరగనున్న శాసనసభ తొలి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు.
Akbaruddin Owaisi
మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేసిన 11 మంది శాఖలపై కాంగ్రెస్ పెద్దలు చర్చించనున్నారు. పదకొండు మంది మంత్రుల శాఖలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ రోజు ఢిల్లీకి చేరుకొని, మంత్రివర్గ కూర్పుపై చర్చించి, తిరిగి ఈ రోజే హైదరాబాద్ చేరుకుంటారు. కేబినెట్లో ముఖ్యమంత్రి సహా 18 మందికి చోటు దక్కుతుంది. రేవంత్ రెడ్డి సహా ఇప్పుడు 12 మంది కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మిగతా ఆరుగురికి, ఏ పదవి ఎవరికి ఇవ్వాలి? అనే అంశంపై కూడా చర్చించనున్నారు. ఆరు బెర్తులకు పలువురు రేసులో ఉన్నారు. మరోవైపు రేపు ఉదయం 8.30 గంటలకు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్‌గా రాజ భవన్లో ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు.





Total views : 78764