వయసుతో పాటు ముఖంపై ముడతలు రావడం సహజం అయితే వయసుతో సంబంధం లేకుండా ముఖంపై ముడతలు వస్తున్నాయి. చిన్న వయసులో ఉన్నవారు కూడా ముఖంపై ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలు ముఖంపై ముడతలు వచ్చేలా, చిన్న వయసులోనే వృద్ధాప్యం వచ్చేలా చేస్తున్నాయి. మన ఇంట్లోనే దొరికే వస్తువులతో చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి ముఖంపై ముడతలు పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు. ఇక వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం. ముఖంపై ముడతలు పోవడానికి కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును పూసుకోవడం వల్ల చర్మం మీద ముడతలు, గీతలు తగ్గుతాయి. కలబందతో కొలాజిన్ ఉత్పత్తి జరిగి చర్మం మృదువుగా మారుతుంది. కలబందలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మం తేమగా, నిగారింపుతో ఉండేలా చేస్తాయి. ముఖంపై ముడతలు పోవడానికి తేనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలను కాపాడతాయి. తేనే చర్మంలో ఉన్న తేమను కాపాడుతుంది. ముఖంపై ముడతలు పోవాలంటే తేనెను అప్లై చేసి కాసేపు ఆరనిచ్చి ఆపై గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గుతాయి. ముఖంపై ముడతలు పోవడానికి కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె చర్మం హైడ్రేటెడ్ గా ఉంచడానికి, పోషణ అందించడానికి తోడ్పడుతుంది. కొబ్బరి నూనె ముఖానికి మసాజ్ చేసుకొని ఓ గంట పాటు ఉంచి ఆపై నీళ్లతో కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి.
aloe vera
మన శరీరంలోని వేడికి దోమలు ఆకర్షితం అవుతాయి. దోమలు కుట్టినప్పుడు మనకు చాలా దురదగా ఉంటుంది. వెంటనే మనకు ఆ ప్రాంతంలో గోకాలనిపిస్తుంది. దోమలు రక్తాన్ని తాగేందుకు సూదిలాంటి మొనను మన శరీరంలోకి గుచ్చుతాయి. ఆ సమయంలో అవి మీ చర్మంలోకి లాలాజలాన్ని ఇంజెక్ట్ చేస్తాయి. దీంతో మీ శరీరం లాలాజలానికి ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా అక్కడ గడ్డలా ఏర్పడుతుంది. దురద వస్తుంది. కొందరికి కాటుకు తేలికపాటి ప్రతిచర్యలు మాత్రమే ఉంటుంది. కొందరికి మాత్రం ఆ నొప్పి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ ప్రాంతం ఎర్రగా మారడం, పుండ్లు పడటం లేదా వాపుగా మారడం చూస్తుంటాం. దోమ వల్ల కలిగే దురద చాలా ఇబ్బంది కలిగిస్తుంది. చికాకుగా ఉంటుంది. పదే పదే గోక్కోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో ఏ పని చేయలేం. చాలా చికాకు వస్తుంది. దురద పెట్టిన చోట చేతులు పెట్టి మరో చోట తాకితే అక్కడ కూడా దురద ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు ఇంటి చిట్కాలతో దురద నుంచి ఉపశమనం పొందవచ్చు. దోమ కాటు వేసిన చోట కలబంద, టూత్ పేస్ట్, తేనె, మంచు, ఏదైనా తైలం, మంచు, అరటి తొక్క వంటివి రాస్తే దురద తగ్గుతుంది.
కలబంద అనేది ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగించబడుతున్న ఔషధ మొక్క. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కలబందలో ఉండే ఆంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు జుట్టు ఫోలికల్స్‌ను బలపరచడంలో సహాయపడతాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కలబందలో ఉండే యాంటీఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో సహాయపడతాయి. చుండ్రు కారణంగా జుట్టు పలచబడటం, పొడిగా మారడం మరియు నొప్పిగా ఉండటం వంటి సమస్యలను కలబంద నివారిస్తుంది. కలబందలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు జుట్టుకు పోషణ అందిస్తాయి. ఇది జుట్టును మృదువుగా, మెరుస్తూ మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. కలబందలో ఉండే ప్రోటీన్లు జుట్టును బలపరుస్తాయి. ఇది జుట్టు విరిగిపోకుండా నిరోధిస్తుంది. కలబందను జుట్టుకు ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కలబంద జెల్‌ను నేరుగా జుట్టు మరియు స్కాల్ప్‌పై పూయాలి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కలబంద జెల్‌తో పాటు, కలబందను మరికొన్ని ఇతర పదార్థాలతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, కలబంద జెల్లో కొన్ని చుక్కల నిమ్మరసం లేదా తేనె కలపడం వల్ల జుట్టు పెరుగుదలను మరింత ప్రోత్సహించవచ్చు. కలబంద అనేది సహజమైన హెయిర్ కేర్ ఉత్పత్తి. ఇది జుట్టు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. క్రమం తప్పకుండా కలబందను ఉపయోగించడం వల్ల మీ జుట్టు దృఢంగా, మృదువుగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.