అదనపు ఆదాయం కోసం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ వ్యాపారుల అవతారమెత్తారు. నలుగురు ఐటీ ఉద్యోగుల నుంచి లక్షా 25 వేలు విలువ చేసే డ్రగ్స్, బైకులను ఎక్సైజ్ STF పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణకు చెందిన నలుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అమీర్ పేటలోని హాస్టల్ లో ఉంటారు. వీరు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. అయితే ప్రతిరోజూ డ్రగ్స్ కొనుగోలు చేయడం కష్టంగా మారడంతో బెంగుళూరులోని ఒక డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు పెట్టుకుని…డ్రగ్స్ ను కొనుగోలు చేసి.. వాటిని తోటి ఉద్యోగులకు, ఇతరులకు విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. పక్కా సమాచారం తెలుసుకున్న STF బీ టీమ్ CI బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు హాస్టల్ పై దాడి చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన ఆదర్శ్, శ్రీజిత్, సంజయ్, డప్పుల అజయ్ లను అరెస్ట్ చేశారు. ఇదే టీమ్ శ్రీనగర్ కాలనీలో గంజాయి అమ్మకాలు చేస్తున్న రవితేజను కూడా అరెస్ట్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- అమీర్‌పేట్ మైత్రీవనంలో అగ్నిప్రమాదంమైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92743