విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న 37 మంది ఉపాధ్యాయుల బృందం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సింగపూర్ పర్యటనకు బయలుదేరింది. 9వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా ఉపాధ్యాయులు అక్కడి అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా సింగపూర్‌లోని పాఠశాలల్లో అమలు చేస్తున్న డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్‌రూమ్స్ మరియు విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులపై వీరు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అక్కడి క్రమశిక్షణ, పాఠశాల నిర్వహణలోని పారదర్శకతను పరిశీలించి, మన రాష్ట్రంలో కూడా అవే ఉన్నత ప్రమాణాలను ప్రవేశపెట్టడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. ఈ విదేశీ విద్యా పర్యటన మన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడంలో మైలురాయిగా నిలుస్తుందని విద్యాశాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.
Tag:






Total views : 75149