మార్కెటింగ్ కమిటీ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కోటేశ్వరరెడ్డి, మిగతా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం తమదే అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి మేలు చేస్తామన్నారు. పార్టీ అభ్యున్నతి కోసం నిత్యం శ్రమించే కార్యకర్తలను తగు రీతిలో పదవులు ఇచ్చి గౌరవిస్తామని మంత్రి కాకాని వివరించారు.
ap news
గతకొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీద ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. పురందేశ్వరి ప్రతీ స్టెప్ పైనా సాయిరెడ్డి ఆన్ లైన్ వేదికగా స్పందిస్తుంటారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం పురందేశ్వరి వ్యవహారశైలిపై విజయసాయిరెడ్డి విపరీతమైన సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి 2019 ఎన్నికలలో పురందేశ్వరి పెర్ఫార్మెన్స్ పై ఆన్ లైన్ వేదికగా స్పందించారు.
ఒక్కోసారి చిన్నపాటి గాయం కూడా పెద్ద సమస్యకు దారి తీస్తుంది.. ఫలితంగా పూడ్చలేని నష్టాన్ని మిగులు తీస్తుంది. తాజాగా గుంటూరులో ఒక యువకుడి విషయంలో ఇదే జరిగింది. ఢిల్లీలో సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ గుంటూరుకు వచ్చి చిన్న ప్రమాదం జరిగింది, చిన్న గాయమే అని లైట్ తీసుకున్నాడో ఏమో కానీ… బ్రెయిన్ డెడ్ అయ్యి అనారోగ్యం పాలైన యువకుడి. ఒక్కగానొక్క కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ఆ వయసులో ఆ తల్లితండ్రుల బాధ వర్ణాణాతీతం!
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం చిత్తూరు పలమనేరు రహదారి భూతల బండ క్రాస్ వద్ద శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది,సీఐ చంద్రశేఖర్ కథనం మేరకు, గంగవరం మండలం కీలపట్ల గ్రామానికి చెందిన మునస్వామి రెడ్డి (70ఏళ్ళు) పశువులు మేపుకుంటూ రోడ్డు దాటే క్రమంలో కర్ణాటక నుండి తిరుపతి వెళుతున్న బ్రీజా కారు ఢీకొంది, దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వైసీపీ అక్రమాలపై టిడిపి నాయకులు తిరుపతి కలెక్టర్ ను కలిశారు.
భూకబ్జాలు, అక్రమ మైన్స్, దొంగ ఓట్ల వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి టిడిపి నాయకులు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీసుకెళ్లారు.వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు… ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు.కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైసిపి నేతల అక్రమాలపై ఆందోళనలు చేస్తున్న టిడిపి నేతలపై అక్రమ కేసులను పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేల దొంగ ఓటర్లను సృష్టించడమే కాకుండా….చనిపోయిన వారి ఓట్లను తీసివేయకుండా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ 15 రోజుల్లో స్పందించకుంటే… న్యాయస్థానాన్ని ఆశ్రయించి…వైసిపి నేతలు అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలు ముందు పెడతామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నేటికీ ఆరేళ్ళు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణములోని వైఎస్సార్ సర్కిల్ లో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలేసి కేక్ కటింగ్ చేసి నివాళులు అర్పించిన వైస్సార్సీపీ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ జావీద్ ఖాద్రి పాల్గొన్న వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బాబయ్య పెద్ద ఎత్తున పాల్గొన్న వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అభిమానులు.
ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది. దీంతో ఏపీ హైకోర్టు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు శ్రీనివాసరావుకు బెయిల్ రాలేదు. కోడికత్తి ఘటన జరిగినప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సైతం శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సీజేఐకు సైతం లేఖ రాసిన సంగతి తెలిసిందే.





Total views : 90055