భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం లోని బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్యాంపు కార్యాలయం లో గులాబి రంగుల ఫ్లెక్సీలు తీసివేసి, కాంగ్రెస్ రంగుల ఫ్లెక్సీలు వేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు గులాబీ రంగులో ఉన్న ఫ్లెక్సీలు ఈ రోజు ఉదయం కాంగ్రెస్ రంగులో ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తెల్లం వెంకట్రావు గత కొన్ని రోజులుగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. 15 రోజుల క్రితం మొదటిసారి ముఖ్యమంత్రి కలిసిన భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, మళ్లీ రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఈ రోజో రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
Tag:
Bhadradri Kothagudem District News
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో లక్ష్మీ సాయి రామ్ రైస్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రజా పంపిణీ కోసం (PDS) లెవీ రైస్ పాలసీ అనుమతులు పొందిన ఈ మిల్లు కాంపౌండ్ లో వేలాది బస్తాల ధాన్యం నిల్వలు టోకులుగా వున్నాయి. అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించి ఈ ధాన్యం టోకులకు మంటలు అంటుకుని క్షణాల్లో చుట్టూ వ్యాప్తి చెంది వందలాది బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతయ్యింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.సుమారు 10 లక్షలు ఆస్థి నష్టం ఉంటుందని తెలిపారు..




Total views : 147624