నిర్మల్ జిల్లాలోని పురాతన చెరువైన తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామడ మండలంలోని పొనకల్ గ్రామ శివారులో గల తుర్కమ్ చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913 లో నిర్మించబడిన ఈ చెరువుకు అత్యంత పురాతనమైన చెరువుగా పేరుంది.
జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి పక్షుల ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు.. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి వలస పక్షులు ఈ ప్రాంతానికి వలసకు వస్తాయి.
రాష్ట్ర అటవీ శాఖ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ట్రెక్కింగ్, బర్డ్స్ ఫెస్టివల్, నేచర్ క్యాంపు, సఫారీలను నిర్వహించింది. జిల్లాలోని ప్రకృతి అందాలను ప్రజలకు తెలిసేలా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో బాగుందని.. పర్యావరణ ప్రేమికులు, ఎన్జీవో సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి