కామారెడ్డి నియోజకవర్గంపైనే రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బిక్కనూరు సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నిరు. కామారెడ్డి రైతుల కలలు నెరవేర్చడానికే కేసీఆర్ పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈనెల 9న ఆయన నామినేషన్ వేయబోతున్నారన్నారు. నామినేషన్ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీల వాళ్లు పోటీ చేసేందుకే భయపడాలి. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బీఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండి అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కొడంగల్ వచ్చి పోటీ చేయకుంటే తానే కామారెడ్డికి వస్తానని రేవంత్ సవాల్ చేశారన్నారు. ఆయన తీరు చూస్తుంటే తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్లుగా ఉందన్నారు. పోచమ్మ గుడి ముందు పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అన్నారు. ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్‌పై సవాల్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఎందుకు కరెంటు, నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. సభలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
Brs
కేసీఆర్ రాక్షస పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వివేక్ వెంకటస్వామి. తనకు టికెట్ ముఖ్యం కాదని కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ సమక్షంలో వివేక్.. తన కుమారుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు. అందరం కలిసి కట్టుగా కేసీఆర్ ను గద్దె దించుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తానని చెప్పారు. తెలంగాణ సాధనలో తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని చెప్పారు.
ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్ మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15వేలు అందిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు కూడా రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. దిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక అనారోగ్యం దృష్ట్యా నేను ఈ పర్యటనకు వచ్చానన్నారు. ఓవైపు సీఎం కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం.. నిరుద్యోగులు, మహిళలున్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు తదితరులు సభలో పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలను తొలగించేందుకు అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మిర్యాలగూడలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్‌రావును గెలిపించాలని పిలుపునిచ్చారు. మిర్యాలగడ్డ మీదనుంచి చెబుతున్నా. కృష్ణానదిలో ఈ సారి తక్కువ వచ్చాయి. కర్నాటకలో ఆపుకున్నరు. శ్రీశైలం దాకా వచ్చినయ్. సాగర్‌కు బొట్టు రాలే. ఉన్నదాంట్లో సర్దుతున్నాం. మంచినీళ్లకు, వ్యవసాయానికి ఇస్తున్నాం. ప్రతి సందర్భంలో ఈ బాధ ఉంటుంది. ఈ బాధ శాశ్వతంగా తీరే ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నది అన్నారు సీఎం కేసీఆర్.
ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మలను దర్శించకున్నారు. పార్టీ జిల్దా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు తో కాలిసి వనదేవతలను దర్శించుకున్నారు. ఆదివాసి సాంప్రదాయాలతో గిరిజన పూజారులు ఘన స్వాగతం పలికారు. వనదేవతల దర్శనం అనంతరం మేడారం, ఊరటం, రెడ్డిగూడెం, వెంగలాపూర్, కొత్తూరు, నార్లాపూర్, బయ్యక్కపేట గ్రామాలలో నాగజ్యోతి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారిని కాంగ్రెస్ గుండాలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. సమ్మక్క సారక్క పోరాటాల గడ్డని,కాంగ్రెస్ బెదిరింపులకు లొంగేది లేదన్నారు. రైతులను చులకనగా చూసే కాంగ్రెస్ నేతలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జలగం వెంకట్రావు అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ ఇవ్వకపోవడం, కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. జలగం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం అందింది. జలగం చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని, బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు కాలనీల కు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలోని అంబేద్కర్ కాలనీలో టిఆర్ఎస్ రాష్ట్ర నేత గూడెం మధుసూదన్ రెడ్డి సమక్షంలో దాదాపు రెండు వందల మందికి పైగా యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గూడెం మహిపాల్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ లోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్వకుంట్ల కన్నారావు హాజరయ్యారు. తెలంగాణ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఐటి శాఖ మంత్రి కేటీఆర్ వల్లనే అని రాజశేఖర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు, బీసీ బందు, కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలని పేద ప్రజల కోసం అందించిన కెసిఆర్ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి కోరారు.
నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు నిచ్చారు. నిన్న మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడికి నిరసనగా ఇవాళ దుబ్బాక నియోజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, బంద్‌ను విజయవంతం చేయాలని కోరింది బీఆర్ఎస్ పార్టీ. నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు నిచ్చారు. నిన్న మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడికి నిరసనగా ఇవాళ దుబ్బాక నియోజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, బంద్‌ను విజయవంతం చేయాలని కోరింది బీఆర్ఎస్ పార్టీ.
జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండడని, కార్మిక పక్షపాతిగా ఆయన చేసిన ప్రజాసేవ అందరికీ తెలిసిందేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అలాంటి నేత వారసుడికి కాంగ్రెస్ పార్టీ నేడు తీవ్ర అన్యాయం చేసిందని హరీశ్ రావు విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అన్నట్లు ఉండేదని చెప్పారు. సీఎల్పీ నేతగా పీజేఆర్ ఆ పార్టీకి ఎనలేని సేవలందించారని గుర్తుచేశారు. అలాంటి పార్టీ ఇప్పుడు కొంతమంది ముఠాకోరుల చేతుల్లోకి వెళ్లిందని, పార్టీ కోసం కష్టపడుతున్న నేతలకు కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతోందని హరీశ్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారని వివరించారు. వారిని బీఆర్ఎస్ పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించేందుకే నేడు విష్ణువర్ధన్ ఇంటికి వచ్చినట్లు హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ లో చేరేందుకు విష్ణు అంగీకరించారని, త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకుంటారని పేర్కొన్నారు. నాగం జనార్దన్, విష్ణులకు బీఆర్ఎస్ లో గౌరవాన్ని, సముచిత స్థానాన్ని కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన తర్వాత విష్ణు అధికార పార్టీలో చేరతారని సమాచారం.




Total views : 92189