శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించిన నాయకులు. ఈ పాత్రికేయుల సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బిఎల్వోలు ఆవకతవకలతో ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారని మృతి చెందిన వ్యక్తులు, వలస వెళ్లిన వ్యక్తుల ఓట్లను రద్దు చేయకుండా ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించాలని దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని పలుమార్లు ఆర్డిఓ, కలెక్టర్ ను సంప్రదించిన వారి వద్ద ఎటువంటి స్పందన లేదని, జనవరి 5 తేది కాకుండా ముందస్తుగానే నూతనంగా నమోదు చేసిన ఓటర్ జాబితాను ఆయా పార్టీలకి ఇవ్వాలని కలెక్టర్ డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని అధికారపార్టీ నాయకులు 30 కోట్లు అయ్యే శివం టు శివం రోడ్డు పనులను 47 కోట్ల నుంచి 53 కోట్ల వరకు టెండర్‌ను పెంచి అందులో కొంత సొమ్ముని దోచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని తమకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం త్వరలోనే నిర్వహిస్తున్న శివమ్ టు శివం రోడ్డు పనులు టెండర్ కు అన్ని పార్టీలను పిలిచి బహిరంగ పిలవాలని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో కి విజ్ఞప్తి చేశారు.
chittoor district news
రాజకీయాల్లో సంస్కారం లేని హిణుడు, అబద్దాల పుట్ట, ఆనం వెంకటరమణారెడ్డని, తన నిరాధారమైన ఆరోపణలతో భూమన కుటుంబాన్ని అవహేళన చేస్తే, తగిన బుద్ధి చెబుతామని వైయస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనం ఆరోపణలను తీవ్రంగా ఖoడించారు వైసిపి నాయకులు. తిరుపతి అభివృద్ధిని అడ్డుకునే భాగంగానే ఆనం వెంకటరమణారెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ రెడ్డి పేరు చెప్పినప్పటి నుంచి తమను ఎదుర్కోకుండా ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని, టిడిఆర్ బాండ్ల వ్యవహారంలో బహిరంగ చర్చకు మేము సిద్ధమని.. మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు అజయ్ కుమార్. ఆనం వెంకటరమణారెడ్డి పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు అజయ్ కుమార్. దమ్ముంటే చర్చకు తిరుపతికి రావాలని సవాల్ విసిరారు. ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని కచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
తిరుపతిలో మాజీ కేంద్ర సహాయ మంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ముఖ్యమంత్రి కొన్ని పత్రికలు, ఛానళ్లనే చూడమని చెప్పడం దారుణమని, ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చింతా మోహన్ అన్నారు. కేంద్రంలో పెట్రో కెమికల్ మంత్రి గా పనిచేశా, భోపాల్ ఘటన బాధితులు ఇంకా ఉన్నారు. మూడేళ్ల క్రితం పాలిమర్స్ బాధితులు ఇబ్బంది పడుతున్నారని, ఆ పరిశ్రమను శ్రీ సిటీకి తరలించడం దారుణమని ఆయన అన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని, విష వాయువులు బయటకు వస్తే చాలా మంది ప్రాణాలు కొల్పేయే ప్రమాదం ఉందని ఎద్దేవా చేసారు. తనపై, పీవీ నరసింహారావు పై కూడా అనేక విమర్శలు చేశారని , మేము ఎంతో ఓపిక పట్టామని ఆయన తెలిపారు. గతంలో కొందరు ప్రముఖులు ఇలాంటి విమర్శలను హుందాగా తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారం మంచిది కాదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపిని సస్పెండ్ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి బంధువు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈవీఎం లపై అనుమానం ఉందని, నగరం లో ఉంచాల్సిన వాటిని గ్రామీణ ప్రాంతంలో పెట్టారని, వాటిని ప్రజల మధ్య ఉంచాలని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన ఎన్నికల జాబితా నగరపాలక సంస్థ లో ఉంచారని అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని రాత్రి వేళల్లో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు.
బుచ్చినాయుడు కండ్రిగ మండలం పల్లమాల గ్రామపంచాయతీ రెవెన్యూ కి చెందిన పేద రైతుల పొలాలు కాలంగి నది పరివాహక ప్రాంతానికి ఆనుకొని ఉండడంతో ఈసారి తుఫాను సృష్టించిన బీభత్సానికి దాదాపు 100 ఎకరాలలో ఇసుక మెట్లు ఏర్పడ్డాయి… పంట పొలాలు ఎడారులను తలపిస్తున్నాయి… ఈరోజు వరకు అక్కడికి పోలేని పరిస్థితి రైతులు తమ కుటుంబాన్ని పోషించే, నేలతల్లి కోతకు గురై వాగు వంక లాగా తయారవడంతో వారి ఆవేదన వర్ణనాతీతం. ఈసారి భీకరమైన తుఫానుకు అదే సమయంలో కాలంగి నది పొంగిపొర్లడంతో వేల లక్షల టన్నుల ఇసుక గులకరాళ్లు పొలాల వైపుకు దూసుకొచ్చి పంట పొలాలు మాయమై ఇసుక ఎడారిగా మారిన వైనం. 1970 లో అప్పటి ప్రభుత్వం రైతు కూలీలకు పల్లమాల రెవెన్యూలో 220 ఎకరాల సొసైటీ భూమిని సాగు చేసుకోమని ఇవ్వడంతో అప్పటినుండి ఇప్పటివరకు ఏదో ఒక విపత్తుకు గురవుతూ నష్టపోతు ఆర్థికంగా చితికిపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ రైతులు 50 సంవత్సరాలుగా శాశ్వత పరిష్కారం కావాలని అడుగుతూనే ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం కొసమెరుపు. ఏది ఏమైనా వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి (పల్లమాల) సర్పంచ్ భర్త అయినా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 220 ఎకరాల సొసైటీ భూమి ప్రక్కనే ఉన్న కాలంగి నది పరివాహక ప్రాంతంలో ఒక కల్వర్టు నిర్మిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. దీనికి అయ్యే ఖర్చు దాదాపు 50 లక్షలు…. ప్రతి సంవత్సరం వీరి నష్టం దీనికి మించి ఉంటుంది వారిచే పరిహారం పంట నష్టానికి మాత్రమే…. ఇది పంట నష్టమే కాదు పొలాలలో ఇసుక వచ్చి చేరి తిరిగి పంటకు పొలాన్ని అనువుగా మార్చుకోవాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది… ఈ ఖర్చు రైతన్న జీవితాన్ని చిద్రం చేస్తుంది… ఇలాంటి ఘటనలే రైతన్న ఆత్మహత్యలకు కారణమవుతాయి….. అధికారులు గుర్తించి వీరి సమస్యకు శాశ్వతం పరిష్కారం చేయాలని కోరారు.
పులిచెర్ల మండలం ఎర్రపాపి రెడ్డి గారి పల్లె సమీపంలో మంగళవారం సాయంకాలం ఏనుగుల దాడిలో పశువుల కాపరి మస్తాన్ మృతి చెందాడు. గ్రామానికి చెందిన మస్తాన్ పశువుల తోలుకొని పొలాల వద్దకు వెళ్లగా గుంపులుగా వచ్చిన ఏనుగులు ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలో గత రెండు నెలలుగా ఏనుగులు పంటలు ధ్వంసం చేస్తున్న వ్యక్తులపై దాడి చేయడం ఇదే మొదటిసారి.. ఏనుగుల దాడిలో పశువుల కాపరి మృతి చెందడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కల్లూరు ఎస్సై రవి ప్రకాష్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు
శ్రీకాళహస్తి లో ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో వచ్చు ఏడు గంగల జాతర అత్యంత వైభవంగా నిర్వహించనున్న సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఈఓ KS రామారావు ఇతర అధికారులు మరియు ఆలయ బోర్డు సభ్యులు పాల్గొని ముందుగా శ్రీకాళహస్తి దేవస్థానం లో అలంకార మండపం వద్ద ఏడు గంగమ్మలకు సారెను వుంచి ధూప దీప నైవేద్యాలు సమర్పించి వేదమంత్రాలు నడుమున సారి ను తీసుకొని నాలుగు మాడా వీధులలో ఊరేగింపుగా వచ్చి శ్రీకాళహస్తి ఏడు గంగమ్మ గుడి వద్దకు సారెను తెచ్చి ఏడు వీధులలో జాతరను జరిపించే నిర్వాహకులకు అందజేశారు.
తిరుమలకు ప్రతి రోజు ప్రపంచం నలుమూలల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.తిరుమలలో మంగళవారం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు. ఇటీవల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవంలో బియ్యం సరిగా ఉడకలేదని కొందరు భక్తులు ఆందోళన చేసినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దాదాపు 700 మంది ఉన్నహాల్‌లో కేవలం 15 మంది మాత్రమే భోజనం చేస్తున్న మిగిలిన భక్తులను రెచ్చ కోట్టేవిధంగా మాట్లాడటం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు.ఇప్పటి వరకు టీటీడీపై చిన్న ఫిర్యాదు కూడా లేకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చెప్పారు. సాదారణంగా ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటుందన్నారు. స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరు సంయమనంతో ఉండాలన్నారు. అన్నప్రసాదంలో ఏదైన పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని ఛైర్మన్ వివరించారు.
మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి రావలసిన పలు విమానాలు రద్దు అయ్యాయి… మంగళవారం నాడు ఉదయం రావలసిన విమానాలు రన్‌వేపై వర్షపు నీరు నిలువ ఉండడంతో రద్దు అయ్యాయని అధికారులు తెలియజేశారు… వాతావరణం అనుకూలంగా ఉంటే తిరిగి రాకపోకలను కొనసాగిస్తామన్న ఎయిర్పోర్ట్ అధికారులు,ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు….
Read Also…
Read Also…
ఏర్పేడు మండలం బండారు పల్లి గ్రామం వద్ద నున్న సున్నపు వాగులో చిక్కుకున్న ఇద్దరు యువకులు సురక్షితం. తాళ్ళ సహాయంతో యువకులను కాపాడిన ఏర్పేడు సీఐ శ్రీహరి బృందం. నిన్న రాత్రి నుంచి వాఘులోనే చిక్కుకున్న ఇద్దరు యువకులు వెంకటేష్ ,శివ. ఉదయం నుంచి సహాయక చర్యలు చేపట్టి అతికష్టం మీద సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఏర్పేడు పోలీసులు, శ్రీకాళహస్తి ఫైర్ సిబ్బంది.
మీచాంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు చేశారు. 24 గంటలు పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు రేణిగుంట విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు చేశారు. తిరుపతి నుంచి వెళ్లే పలు రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసింది… వర్ష తీవ్రత పెరుగుతుండడంతో గోగర్భం డాం గేట్లను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దు అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.





Total views : 90047