ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి,.. బ్యాంక్‌లు అప్పులు ఇవ్వక చనిపోయారన్నారు.
ఈ భూమి మీద జగన్ అనే వ్యక్తి ఉన్నంత కాలం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. 1983 నుంచి నేను కాంట్రాక్టు చేస్తున్నాను. జగన్ పెట్టిన బాధలకు నేను అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. ఐదు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చి బ్రతికిన వ్యక్తిని నేను. ఈ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీ కి వస్తాడా అని ఎదురు చూస్తున్నాను. సభకు పిలిపించండి. 2019నుంచి 2024 వరకు రాక్షస పాలన జరిగిందని విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ…
- ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సీపీడబ్ల్యూడీ కేడర్ నుంచి వేరు చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై ఈ పోస్టులను స్వతంత్ర ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌గా నిర్వహించనున్నారు. ఢిల్లీని వేగంగా అభివృద్ధి చెందుతున్న,…
- తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి.టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు.…
- నేడు, రేపు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు, రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, వాటిపై చేపట్టిన చర్యలు, పురోగతికి సంబంధించిన నివేదికలపై సీఎం సమీక్షించనున్నారు. జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై…
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి