తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారయింది. ఈ నెల 19న ఆయన దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. మంత్రివర్గ విస్తరణ గురించి హైకమాండ్ తో ఆయన చర్చించనున్నారు. మంత్రివర్గ కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. హోం, విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. నామినేటెడ్ పదవుల గురించి కూడా అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పదవుల పంపిణీ జరగనున్నట్టు సమాచారం.
#congress
తెలంగాణ శాసన సభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు. ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసన సభ చరిత్రలోనే విని ఉండమని అన్నారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీచేసి కేవలం పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు. శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకు ఉందని, తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను ఆయన కోట్ చేశారు. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరినీ మోసం చేయనని, ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా ఇలాగే ఉందని, గవర్నర్ ప్రసంగం కూడా అలాగే అనిపించిందని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని, తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమేనని కేటీఆర్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం లభించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్లో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గవర్నర్ తొలి ప్రసంగం కాబట్టి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే అంశంపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. అదే సమయంలో ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? మున్ముందు ఎలా ఉండబోతుంది? అనే అంశాలతో గవర్నర్ ప్రసంగంలో ఉండనున్నట్లుగా సమాచారం. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో రెండు గ్యారెంటీలలో కొన్ని అంశాలను అమలు చేస్తోంది. మిగతా గ్యారెంటీలపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. కాగా, ఈ నెల 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు ప్రసంగిస్తారు.
హైదరాబాద్, డిసెంబర్ 14న రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా దినసరి అనసూయ సీతక్క నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి లతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ హనుమంత రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు కావొస్తుంది. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది. ఈ పర్యాయం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా, సీనియర్ నాయకులు మంత్రి పదవులను అలంకరించారు. తనదైన శైలిలో రేవంత్ ముందుకు వెళుతున్నారు. అధికారం అనుభవించి ఒకేసారి కోల్పోయిన ప్రతిపక్షానికి మింగుడు పడడం లేదా..? ప్రభుత్వం ఏర్పడి వారం రోజులైనా కాలేదు. అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేస్తున్నాయి. దీనిలో ఉన్న అంతర్గత మర్మమేంటో…? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపగలదా..? బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటవుతున్నాయా …? ముందేమైనా ప్రమాదం ముంచుకొస్తుందా…? వీటన్నింటిని రేవంత్ సమర్థవంతంగా ఎదుర్కోగలరా….?
ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్లో ప్రజా దర్బార్. ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారికి సూచించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించనున్న సీఎం. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ ని నిర్వహించనున్న సీఎం. ఈ కార్యక్రమానికి హాజరు కానున్నడిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు…
తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్లో చర్చించిన అంశాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ ఖర్చులపై చర్చించినట్లు తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుపైనా సుదీర్ఘ చర్చ జరిగినట్లు వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలియాలని అభిప్రాయపడ్డారు. అందుకే అన్ని అంశాలను తెలపాలని అధికారులను కోరినట్లు తెలిపారు. ఆదాయ-వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ముందుగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయబోతున్నట్లు తెలిపారు. అందుకోసం ఈ నెల 9వ తేదీన ఆ రెండు గ్యారంటీలను అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. అందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు ఉందని తెలిపారు. మిగిలిన నాలుగు గ్యారంటీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అంతకుముందు తమకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు చెప్పారు.
తెలంగాణలో ఇక ప్రజా పాలన మొదలైందా? పరిపాలన విషయంలో రేవంత్ తనదైన ముద్రవేస్తున్నారా? అంటే పరిస్థతులు అవుననే చెబుతున్నాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు. బాధ్యతలు తీసుకోగానే పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజలకు అందనంత దూరంగా ఉన్న ప్రగతి భవన్ పైనే రేవంత్ గురి పెట్టారు. సీఎం నివాసం ముందు కట్టుదిట్టంగా నిర్మించిన కంచెను ప్రమాణస్వీకారం చేసే లోపలే బద్దలు కొట్టించారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామన్నది చెప్పకనే చెప్పారు. ఫైళ్లపై తొలి, మలి సంతకాల విషయలోనూ ప్రత్యేకత కనబరిచారు.
అధికారం ఉన్నా లేకున్నా మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికే అందుబాటులో ఉంటానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రం లో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ…కష్టపడి పనిచేసిందుకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే దాక ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తానని తెలిపారు.అలాగే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అధైర్యం చెందవద్దని ప్రజల తో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మానకొండూర్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రిగా రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64, బీఆర్ఎస్ 39 సీట్లు, బీజేపీ 8 స్థానాలలో విజయం సాధించాయి. ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. అయితే పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈ రోజు సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.






Total views : 90135