లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించ వలసిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి పార్లమెంటరీ పార్టీ నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామిల జాప్యంపై నిరసన తెలుపుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని , పార్టీ నాయకులు సమన్వయంతో పని చేసేలా సీనియర్లు చొరవ తీసుకోవాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
#congress
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రహస్యమైత్రి మరోసారి బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందన్నారు. బీజేపీ అజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్‌కు మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని గవర్నర్ నిరాకరించారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. ఇది ద్వంద్వ నీతి కాదా అంటూ హరీష్‌రావు నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నాయని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సర్పంచ్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతినెల ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి సీతక్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. గత పాలకులు పదేండ్లపాటు సామాజిక మాధ్యమాల్లో ఉన్నది లేనట్టుగా చూపి కాలం గడిపారని విమర్శించారు. అందుకే ప్రజలు వారిని తిరస్కరించి తమకు అధికారం కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు వస్తున్న ప్రజా ఆదరణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆస్తులన్నీ అడ్డదిడ్డంగా అమ్మేసేవారని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ విమర్శించారు. ప్రజలందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కురవి మండలం బలపాలలో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. హామీలను అమలు చేయడంలో కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. అధికారం పోతుందనే అసహనం, ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులున్నారని ఆరోపించారు. మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారని, అందువల్ల మనమే శాంతంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు వస్తాయని రాంచంద్రునాయక్ అన్నారు.
పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్యరావు, సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్ లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది. సంగారెడ్డిలోని జడ్పి సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వే నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమానికి, సమస్యలను పరిష్కరించేనందుకు ముందు ఉండాలన్నారు. టిఆర్ఎస్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని వారు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రోడ్లు, మంచినీటి సౌకర్యాలతోపాటు అర్హులకు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రజలకు మేలు చేసే గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పలువురు జెడ్పిటిసిలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులయింది. కాంగ్రెస్ నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది ప్రజల ప్రభుత్వం.. ప్రజల పాలనలో వారి కలలను నిజం చేయడమే లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నాము. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్ర వీగకుండా వెన్నులో భయం పెట్టుకొని పని చేస్తామని ఆయన రాసుకొచ్చారు. అలాగే 10 సంత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పు నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తామని భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు రెండో తేదీన జీతాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌ది. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ నా కోసం ఏర్పాటు చేశారని ప్రతి పౌరుడు అనుకునే విధంగా మా పరిపాలన సాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ. హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ. కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ పై కాంగ్రెస్ చొరవ తీసుకోవాలని, కమీషన్ల కోసం ప్రాజెక్ట్‌ను నాణ్యతాలోపంతో డిజైన్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాలన్న డీకే అరుణ. ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా హామీలు కూడా నిలబెట్టుకోవాలని సూచించారు.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమె ఏపీనా లేక తెలంగాణనా అన్న చర్చ కొనసాగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వలేదు. తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టి ఆ ప్రాంతంలోనే వైఎస్ షర్మిల కార్యకలాపాలు సాగించారు. తన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దీంతో ఆమెను ఏపీకి నియమిస్తున్నారన్న ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు ఆమె ఇటీవలి వరకు తెలంగాణలోనే కదా ఉన్నారు. తెలంగాణకే పరిమితం అవుతారన్న అంచనాలు కూడా వచ్చాయి. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. పార్టీలో వైఎస్ షర్మిలపై రేవంత్ స్పష్టత ఇచ్చారు. వైఎస్ షర్మిల తమ పార్టీకి చెందిన ఏపీ నేత అని తేల్చేశారు. షర్మిల ఏపీకి చెందిన నాయకురాలని రేవంత్ కుండబద్దలు కొట్టారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో పంట పొలాల్లో జాతీయ రైతుల దినోత్సవాన్ని మహిళా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొనీ మహిళలతో కలిసి నాట్లు వేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జాతీయ రైతుల దినోత్సవంలో భాగంగా మహిళా రైతులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, రైతు లేనిదే రాజ్యం లేదని దేశానికి అన్నం పెట్టే రైతన్నల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రైతుల దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మహిళా రైతులు ఎమ్మెల్యేను కోరారు.
మంచిర్యాల జిల్లా.. మాజీ కేంద్ర మంత్రివర్యులు, బడుగు బలహీవర్గాలకు ఆశాజ్యోతి, రాజకీయాల్లో ఓటమి అంటూ ఎరుగని వీరుడు, ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అలుపు లేకుండా పోరాటం చేసిన యోధుడు, స్వర్గీయ గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులు అర్పించి, మందమర్రి మనోవికాస్ స్కూల్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసారు. మందమర్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవ్గంలో వెంకటస్వామి (కాకా) సేవలు మరువలేనివి అని నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడేవారు అని గుర్తు చేశారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో తను వంతు పాత్ర చరిత్రలో చిరస్మరణీయులు అని వర్ణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, INTUC నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.




Total views : 90114