పేద ప్రజలు సంతోషంగా ఉండడానికి… అద్దె ఇళ్లలో అవస్థలు తీరడానికి టిడిపి ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కడప, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో రెండు విడతల్లో సుమారు 5 వేల ఇళ్లను అత్యాధునిక వసతులతో అపార్ట్మెంట్ స్థాయి నిర్మాణాలు చేపట్టారు. పేదలకు కలగానే మిగిలిపోతున్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలు టిడ్కో ఇళ్లను చూసి పేదలు సంబరపడ్డారు. త్వరలోనే సొంతింటిలో చేరుతామని ఆశతో ఎదురు చూశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లకు బ్రేక్ వేశారు. టిడిపి ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది. గత ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో దెబ్బతిన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పూర్తయిన ఇళ్ల మౌలిక వసతుల కోసం 45 కోట్లతో టెండర్లు వేసినా… పనులు ఇంకా మొదలు కాలేదు. కొత్త ప్రభుత్వమైన టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి సొంతింటి కల నెరవేరుస్తుందని లబ్ధిదారులు ఆశతో ఎదురుచూస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడంతో…
- విజయ్ నేతృత్వంలో ‘సామాజిక న్యాయ విజయ కూటమి’.తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం మరో కీలక రాజకీయ అడుగు వేసింది. టీవీకే ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త కూటమికి సామాజిక న్యాయ విజయ కూటమి గా పేరు ఖరారైంది. విజయ్ అధ్యక్షతన చెన్నై పనయూర్లో జరిగిన సమన్వయ…
- యాదగిరిగుట్టకు భారీగా తరలివస్తున్న భక్తులు: బీర్ల ఐలయ్య.తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిపో పరిధిలో భద్రత కోసం సీసీ…
- కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్.లిక్కర్ రవాణా టెండర్ల కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్ తగిలింది. ఇదే కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కారుమూరిపై సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు..…
- ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్.. నాకు రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన సినిమా అంటూ రవితేజ ఎమోషనల్ మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మ రథం పడుతున్నారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి