Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్.

కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్.

by CVR NEWS

లిక్కర్ రవాణా టెండర్ల కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్ తగిలింది. ఇదే కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కారుమూరిపై సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. సిట్ దాఖలు చేసిన పీటీ వారెంట్‌కు అనుమతి ఇచ్చింది.

పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి ఇవ్వడంతో కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. లిక్కర్ రవాణా టెండర్ల కేసులో గత నెల 23న కారుమూరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.

కారుమూరి నాగేశ్వరరావును తమ కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయగా.. తాజాగా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో లిక్కర్ టెండర్ల కేసులో కారుమూరిని సిట్ అధికారులు విచారించనున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: