ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడులో ఉద్రిక్తత. సీఐ సమక్షంలోనే అనుమానిత వ్యక్తి పై గ్రామస్థుల దాడి. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ జ్యోతికి చెందిన లారీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై స్థానికుల ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానంతో బోశెట్టి త్రినాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతడిని కారులో ఎక్కించుకొని వెళ్తుండగా అడ్డగించిన గ్రామస్తులు. పోలీసులు వినియోగించిన ఆ ప్రైవేటు కారును ధ్వంసం చేసి. సీఐ, ఎస్సై సమక్షంలోనే త్రినాధ్ పై స్థానికులు దాడి. గ్రామానికి చెందిన బోశెట్టి త్రినాథ్, మరో ఇద్దరు కలిసి తన లారీని దగ్ధం చేశారని సర్పంచ్ జ్యోతి దంపతులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా ఆ 3 వ్యక్తులు గ్రామంలో అలజడి సృష్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో తమకు చెందిన వరి కోత యంత్రాన్ని కూడా ధ్వంసం చేశారని, ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
CVr health
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, జాతీయ రహదారి 65 మీద గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 69 లక్షల 98వేలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు నుండి బస్ లో విజయవాడ వైపుకు వెళ్తున్న గుడ్లవల్లేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం. ఎటువంటి ఆధారాలు లేని నగదుగా గుర్తించి కేసు నమోదు చేసిన చిల్లకల్లు పి.ఎస్ సబ్-ఇన్స్పెక్టర్ కృష్ణబాబు.
అనంతపురం జిల్లా గుత్తి మండలంలో కీచక యోగా టీచర్ ను గురువారం గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి నర్సింగప్ప వెల్లడించారు. డిఎస్పీ మాట్లాడుతూ…. గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్ నందు ఔట్ సోర్సింగ్ పై యోగా టీచర్ గా పని చేస్తున్న అనిల్ కుమార్ రెడ్డి అదే స్కూల్లో చదివే ఓ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి నమ్మించి బాలిక ఇంటిలోని బంగారు నగలు తెప్పించుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంట తీసుకొని పోయి శారీరకంగా అనుభవించి తిరిగి గుత్తికి తీసుకొచ్చి వదిలేసి తనకు బంగారం ఇచ్చినట్లు గాని, శారీరకంగా కలిసినట్లు గాని, ప్రేమ విషయం గానీ, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇతనిపై గతంలో 2019వ సంవత్సరంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా రేప్ కేసులో నిందితుడు నిందితుడిగా ఉంటూ ఆ కేసులో కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు. అయితే గత నెల 25 నుంచి బాలిక కనపడకపోవడంతో తల్లిదండ్రులు గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి అనుమానంతో పాఠశాలలో పనిచేసే యోగా టీచర్ అనిల్ కుమార్ రెడ్డిని విచారణ చేయగా ఈ భాగోతం బయటపడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యోగా టీచర్ అనిల్ కుమార్ రెడ్డిపై IPC 366, 344, 376,406,మరియు ఫోక్సో ఆక్ట్ 5,6 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అనంతరం ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు కంచరకుంట్ల రాజు (40) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయి కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాడు. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమీపాన మతి స్థిమితం కోల్పోయి కన్నతల్లిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి చంపాడు. దీంతో పక్కింట్లో ఉండే మహిళ అడ్డుపడ గా మహిళ తల పై గొడ్డలితో నరకడంతో చుట్టుపక్కల వారు కొన ఊపిరితో ఉన్న మహిళను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజు స్థానికుల నుండి తప్పించుకొని గొడ్డలితో ఊరందరిని చంపేస్తా అంటూ పారిపోయి ఒంటరిగా ఉన్న వారి పై దాడి చేయడానికి ప్రయత్నిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి రాజు కోసం గ్రామంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒంటరిగా ఎవరు బయటకు రావద్దని గ్రామస్తులను పోలీసులు హెచ్చరించారు. దీంతో తిరుమలగిరి గ్రామం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై, విషాదఛాయలు అలుముకున్నాయి.
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొద్దుల సాయి అనే యువకుడు కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. యువతిని వెంటనే కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ కరుణాకర్ రావు ఆమె చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి వచ్చి స్టేట్మెంట్ రికార్డు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చించివేత. పాత గుంటూరు లోని బాలాజీ నగర్, 3,8 డివిజన్ ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేసిన వైనం. జనసేన కార్యకర్తలు ఆగ్రహం. పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే చించినట్లు జనసేన నేతల ఆరోపణలు. దర్యాప్తు చేస్తున్న గుంటూరు పోలీసులు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఎంపీ కేశినేని నాని కి రాబోయే ఎన్నికల్లో సీటు లేదంటూ స్పష్టం చేసిన టీడీపీ అధిష్ఠానం. నిన్న సాయంత్రం నాని నీ కలిసిన మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టం రఘురాం, కృష్ణాజిల్లా టిడిపి అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు. 7వ తేదీ చంద్రబాబు తిరువూరు సభకు కేశినేని నాని నీ దూరం పెట్టిన పార్టీ. తిరువూరు లో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జీ గా నియమించనున్న చంద్రబాబు.
జాతీయ రహదారి చంద్రశేఖరపురం వద్ద రోడ్డు ప్రమాదo లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కారు. లారీని వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కారు. కార్ నెంబర్ ఏపీ 39 EB2468. ప్రమాదంలో ఎమ్మెల్సీ పిఏ వెంకటేశ్వర్లు మృతి. ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కి డ్రైవర్ కు తీవ్ర గాయాలు. మరో వాహనంలో అపోలో ఆస్పత్రికి తరలించిన స్థానికులు.
పల్నాడు జిల్లా, దాచేపల్లి ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. మున్సిపల్ కార్మికులు సమ్మెలో భాగంగా కార్మికులు రోజు సమ్మె చేస్తున్న తరుణంలో ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు వేరే వారి ద్వారా పారిశుద్ధ పనులు చేయించాలని చూడటంతో వారిని అడ్డుకున్న కార్మికులు. రంగ ప్రవేశం చేసిన దాచేపల్లి పోలీసులు. కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బలవంతంగా స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు, ట్రాక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్న కార్మికులు.
అనకాపల్లి జిల్లా, కంటతడి పెట్టుకున్న మంత్రి గుడివాడ అమర్ నాథ్. నాకు టిక్కెట్ దక్కలేదని కొన్ని పత్రికలు ఛానళ్ళు రాస్తున్నాయి. అమర్ పనైపోయింది అంటు ప్రచారం చేస్తున్నారు. చిన్న వయస్సు నుండే కష్టాలు చూసిన వాడిని ఇలాంటి వార్తలు వల్ల నేను దిగజారిపోను. అన్నింటికంటే పెద్ద పదవి ఒకటి ఉంది అది వైసీపీ కార్యకర్త పోస్టు అది ఉంటే చాలు ఇంకేమి అవసరం లేదు. మీతో పాటు కార్యకర్త గా జెండా మోయడానికి సిద్దం ఉన్నా. వీధివీధుల్లో కార్యకర్త గా తిరుగుతా. రాష్ట్రవ్యాప్తంగా ఓ ముఠా తయారైంది. వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం అధికారం వచ్చాక కొంత మందికే పదవులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళు పార్టీలో ఉండటం కంటే వెళ్లడమే మంచిది. నా రాజకీయ జీవితం సంతృప్తిగా ఉంది. గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారు. కార్పోరేటర్ గా ఎమ్మెల్యేగా మంత్రి పని చేసా అది చాలు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు భరత్ కు సహకరించాలి.





Total views : 89981