ముక్కోటి ఏకాదశి సందర్భంగా శిల్ప అవెన్యూ, తులసి వనంలో అందంగా ముస్తబైన ఆలయాలు , హరి నామస్మరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తగు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గుడి అర్చకులు శ్రీహరి మాట్లాడుతూ ఈ రోజు స్వామి వారి దర్శనం ప్రతి ఒక్కరు చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు తెలిపారు అదేవిధంగా ముక్కోటి ఏకాదశి విశిషటత గురించి వివరించారు.
Devotees
రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవ లో ప్రతిష్టించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తదుపరి రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాటు వేలాది భక్తులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం, భక్తుల కు ఎంతో ప్రీతిపాత్రమైన ముక్కోటి ఏకాదశి ని పురస్కరించుకొని మైలవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వారదర్శనం లో కనువిందు చేసారు. తెల్లవారుజామున నుండి భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారదర్శనం లో వీక్షించేందుకు బారులు తీరారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి తీర్ద ప్రసాదాలు అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ మాచవరం ఆంజనేయస్వామి దేవస్థానం ధ్వజ స్తంభ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో భవాని మాట్లాడుతూ గత మూడు రోజులుగా పలు విశేష పూజలు నిర్వహించి, ఈ రోజు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూజలతో భక్తులందరూ స్వామివారి నీ భారీ సంఖ్యలో దర్శించినందుకు ఆనందంగా ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Read Also..
తిరుమలలో చిరుజల్లులు కురుస్తుండడం, సీతాకాలం కావడంతో తిరుమల వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. ఓ వైపు చల్లని చలి గాలులు వీస్తున్నాయి. మరోవైపు పొగ మంచి తిరుమలను దట్టంగా కప్పేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా, ఆనందంగా సంతోషాన్ని నింపుతుంది. చిరుజల్లులు, పొగ మంచు, చలి ఇలా ఊటీని సైతం మించిపోయేలా ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల లో వాతావరణం ఈ విదంగా ఉండడంతో భక్తులు తన్మయంతో ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. మరో వైపు ఘాట్ రోడ్లలో కూడా పొగ మంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి అంటు టీటీడీ సూచన చేస్తుంది.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడంతో నరసాపురం వశిష్ట గోదావరి వలందర్ రేవులో తెల్లవారుజాము నుండి వేలాది మంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి గోదావరి నదిలో కార్తీకదీపాలను వదిలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి సమీపంలోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా పుణ్యఫలం పొందుకుంటామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నరసాపురం పట్టణంలోని కపిల మల్లేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని లక్షదీపార్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రాకతో నరసాపురం వశిష్ట గోదావరి తీరం జన సందోహంగా మారింది. ప్రతి ఏటా కార్తీక మాసం సందర్భంగా ఈ వలందర్ రేవులో నిత్యం వేలాది మంది భక్తులు కార్తీకదీపాలను వదిలి పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. వశిష్ట ముని తపస్సు చేసిన ఈ ప్రాంతంలో కార్తీక మాసంలో పూజలు నిర్వహించడం ద్వారా ఆ పరమశివుడి అనుగ్రహం పొందుకుంటామని భక్తుల నమ్మకం భక్తజన సందోహంతో శివనామ స్మరణ మార్మోగింది.
Read Also..
తిరుమలలో భక్తుల రద్దీ సాధరణం. శ్రీవారి దర్శనం కోసం 04 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న శ్రీవారి భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,176 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం..4.22 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…20,157 మంది.టోకెన్ లు లేని భక్తులకు 8 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
శ్రీశైలంలో కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పాలు ప్రసాదాలు అందచేస్తున్నారు. శని,అది,సోమవారాలలో స్పర్శ దర్శనం,సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేశారు. నేడు సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం పౌర్ణమి రెండవ సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. గత ఇరవై నెలలుగా ప్రతి నెల 100 కోట్లు హుండీ ఆదాయం భక్తుల కానుకల రూపంలో వస్తుంది. వరుసగా 20వ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది. అక్టోబర్ లో కూడా హుండి ఆదాయం 108 కోట్లు వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి సాధారణంగా ఉంది. నిన్న దాదాపు 59,335 మంది తిరుమల శ్రీవారిని దర్శించుచున్నారు. అలాగే 23 వేల 271 మంది తలనీలాలు సమర్పించారు.నిన్న ఒక్కరోజు ఉండి ఆదాయం 3.29 కోట్లు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.వీరికి సుమారు సర్వదర్శనం 12 గంటల సమయం పడుతుంది.