చితి నుండి బ్రతికొచ్చిన మనిషి .. వినడానికి వింతగా ఉంది కదా. అసలు విషయం తెలిస్తే అందరు షాక్ అవుతారు . ఇదంతా రాజస్థాన్ లో జరిగిన వింత ఘటన. రోహితాశ్ కుమార్(25) అనే చెవిటి, మూగ వ్యక్తి అనాథ .. కుటుంబం లేకపోవడంతో ఒక షెల్టర్ హోమ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి ఆరోగ్యం క్షీణించడంతో నిర్వాహకులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మధ్యాహ్నం 2 గంటలకు రోహితాశ్ చనిపోయాడని వైద్యులు తెలిపారు . పోలీసులు వచ్చి పంచనామా పూర్తిచేశాక మృతదేహాన్ని అంత్యక్రియలకు ప్రారంభించారు. ఆ సమయంలో అతడు శ్వాస తీసుకోవడాన్ని గమనించారు. దీంతో వెంటనే అంబులెన్స్ లో రోహితాష్ ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు . ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ , పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనపై జుంజును జిల్లా కలెక్టర్ రమనతార్ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల తీరును తీవ్రంగా ఖండించారు. చనిపోయినట్లు నిర్ధారించిన డాక్టర్ యోగేష్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, డాక్టర్ సందీప్ పచార్లను సస్పెండ్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు.తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- అమీర్‌పేట్ మైత్రీవనంలో అగ్నిప్రమాదంమైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
- వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, కేసును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 92367