తెలంగాణ(Telangana) ఇంటర్ ఫలితాలు(Inter Results) బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ(Education Principal Secretary) బుర్రా వెంకటేశం(Burra Venkatesham) తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నట్లు వెల్లడించారు. పరీక్ష రాసిన విద్యార్థులు పలితాలను http://www.manabadi.co.in/ వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ లేదా https://results.cgg.gov.in/ వెబ్సైట్లోనూ చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఇది చదవండి: ఏపీ, తెలంగాణలో నేడు నుంచి వేసవి సెలవులు ప్రారంభం..
అయితే.. తొలత ఇంటర్ మొదటి రెండవ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ 23న (మంగళవారం) విడుదల చేయాలని భావించారు. అయితే.. పలు కారణాలవల్ల ఏప్రిల్ 24 (బుధవారం) ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక.. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో.. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు.. ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా…
- యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..తెలంగాణవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో…
- తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులు..తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర విద్యాశాఖ, ఇంటర్ బోర్డు కలిసి విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్యలో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. నూతన విద్యావిధానంలో భాగంగా.. ప్రాక్టికల్స్, మ్యాథ్స్ మార్కుల్లో కీలక మార్పులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 78131