టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మణి సాయి తేజ, రేఖ నిరోషా జంటగా నటిస్తూ,.. నాగ మునెయ్య(మున్నా) నిర్మాతగా, నందిపాటి శ్రీధర్ రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మతలుగా, ముని సహేకర దర్శకత్వం వహిస్తున్నా చిత్రమ్ “మెకానిక్”. ట్రబుల్ షూటర్… ట్యాగ్ లైన్. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని త్వరలో విడుదలకి సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాధ రావు ఈ సినీమాలో కైలాష్ ఖేర్ పాడిన పాటని లాంచ్ చేయడం జరిగింది.
ఈ సినిమాలో ఇప్పటికే సిద్ శ్రీరామ్ పాడిన “నచ్చేసావే పిల్లా నచ్చేసావే ” పాట ఇన్‌స్టా గ్రామ్ లో 100M+ వ్యూస్ సాధించగా ,youtube లో 8.5M+ వ్యూస్ సాదించి ట్రెండింగ్ లో ఉంది.
తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, ,వీర శంకర్ ,జబర్దస్త్ దొరబాబు సునీత మనోహర్, సంధ్య జనక్ తధితరులు నటించిన ఈ చిత్రానికి పుష్పా ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ స్టంట్స్ అందించారు. ఈ సినిమా త్వరలో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు వెల్లడించి పాటని రిలీజ్ చేసిన నక్కిన త్రినాధ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Film News
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మల్టీటాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. హీరోగా, స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ ఉన్నారు. డీజే టిల్లు సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎంతో సెలెక్టివ్‌గా సినిమా కథలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఈ హీరో బొమ్మరిల్లు భాస్కర్‌తో చేతులు కలిపారు.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్‌గా SVCC 37 అని ఫిక్స్ చేశారు. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.
నేడు ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని ఓ స్ట్రైకింగ్ పోస్టర్‌తో అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్లో బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో సిద్దు కనిపిస్తున్నారు.
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వంటి సూపర్ హిట్‌తో బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి డైరెక్టర్‌తో.. యూత్ సెన్సేషన్ సిద్దు సినిమా చేస్తున్నాడని తెలియడంతోనే అంచనాలు పెరిగాయి. వీరిద్దిరి కాంబోలో రాబోతోన్న ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంతా భావిస్తున్నారు.
ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్లు తెలిపారు. క్యాస్ట్ అండ్ క్రూ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నారు.
వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న తేడా చూడకుండా.. నవ్వులు పంచే సినిమా అయితే చాలు హిట్ చేస్తామని ప్రేక్షకులు ఎన్నో సార్లు నిరూపించారు. సర్వైవల్ కామెడీ జానర్లో పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘నమో’ను తెరకెక్కిస్తున్నారు. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ ప్రశాంత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతోన్నారు. శనివారం నాడు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో
భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆదిత్య నా దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు. ఎంతో సిన్సియర్‌గా పని చేస్తాడు. రెండు మూడేళ్లు నా దగ్గర ఎంతో అకింతభావంతో పని చేసేవాడు. అతను ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. ఏదో చేయాలని, నేర్చుకోవాలన్న తపన ఉంటే అవకాశాలు వస్తాయి. నమో అనే పేరు వినగానే.. నరేంద్ర మోదీ గారి మీద కథ అనుకున్నా. నగేష్, మోహన్ హీరోల పాత్రల పేర్ల మీద టైటిల్ పెట్టానని తెలిపాడు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఆదిత్య రెడ్డి కుందూరు మాట్లాడుతూ.. ‘ఈ రోజు మా కోసం వచ్చిన నా గురువు భీమనేని శ్రీనివాసరావు గారికి థాంక్స్. ఆయన దగ్గర పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. నా కథను ఒప్పుకున్న మా హీరో విశ్వంత్, హీరోయిన్ విస్మయకు థాంక్స్. మా సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సినిమాను చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
హీరో విశ్వంత్ దుద్దంపూడి మాట్లాడుతూ.. ‘ఇదొక డిఫరెంట్ చిత్రం. మా డైరెక్టర్ ఆదిత్య డిఫరెంట్ కథను రాసుకున్నారు. ఎంతో వేగంగా సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాకు పూర్తి క్రెడిట్ మా దర్శకుడికే ఇవ్వాలి. ఈ నమోను మున్ముందు సిరీస్‌లుగా కూడా తీయొచ్చు. త్వరలోనే మా సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
అనురూప్ కటారి మాట్లాడుతూ.. ‘ఈ రోజు పోస్టర్, టైటిల్ లాంచ్ చేశాం. ఈ రోజే మేం సినిమా గురించి పూర్తిగా చెప్పలేం. నాకు అవకాశం ఇచ్చిన ఆదిత్యకు థాంక్స్. విశ్వంత్ ఈ సినిమా తరువాత ఇంకా బిజీ అవుతారు. ఈ మూవీ ట్యాగ్ లైన్ ఫుల్ వైరల్ అవుతుంది’ అని అన్నారు.
హీరోయిన్ విస్మయ మాట్లాడుతూ.. ‘మా సినిమాలో ఫుల్ ఫన్ ఉంటుంది. విశ్వంత్ చాలా బాగా నటించారు. అనురూప్ పాత్ర బాగుంటుంది. నాకు సహకరించిన చిత్రయూనిట్‌కు థాంక్స్’ అని అన్నారు.
చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో బిగ్ బాస్ ఫెమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్
కీలక పాత్రల్లో నటించిన చిత్రం కలశ. కొండా రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు.ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా పై మరింత అంచనాలను పెంచింది. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ ఆవిష్కరించి చిత్ర యూనిట్ ను అభినందించారు.
ఈ సందర్భంగా దర్శకులు మలినేని గోపిచంద్ మాట్లాడుతూ : కలశ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హర్రరా ? అనేది తెలీకుండా తెలివిగా కట్ చేశారు. కలశ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి డైరెక్ట్ చేసిన దర్శకుడు రాంబాబు కి నిర్మాత కు నటీనటులకు టెక్నీషియన్స్ కు అల్ ది బెస్ట్ డిశంబర్ 15 న రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి అని అన్నారు.
హీరోయిన్ భానుశ్రీ (బిగ్ బాస్ ఫేమ్): మాట్లాడుతూ: కలశ ట్రైలర్ ను డైరెక్టర్ మలినేని గోపిచంద్ గారు లాంచ్ చేశారు. థాంక్ యు సో మచ్ గోపిచంద్ గారు. డిశంబర్ 15 మా కలశ రిలీజ్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అన్నారు.
చిత్ర దర్శకుడు: కొండా రాంబాబు మాట్లాడుతూ: మా కలశ మూవీ ట్రైలర్ ను దర్శకులు మలినేని గోపిచంద్ గారు లాంచ్ చేసి మా టీం ను మెచ్చుకున్నారు. డిశంబర్ 15న రిలీజ్ అవుతుంది .అందరూ తప్పకుండా కలశ సినిమా ను చూడండి.
నిర్మాత: శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి మాట్లాడుతూ: స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని గారు మా కలశ ట్రైలర్ ను లాంచ్ చేశారు. డిశంబర్ 15 న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది మిస్ అవ్వకుండా సినిమా చూడండి అని అన్నారు.
హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ : కలశ మూవీ ట్రైలర్ ను డైరెక్టర్ మలినేని గోపిచంద్ గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. డిశంబర్ 15న రీలీజ్ అవుతున్న కలశ సినిమాను ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నారు.
భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగధారి, సంగీతం: విజయ్ కురాకుల, ఎడిటర్: జునైద్ సిద్దిఖీ, లిరిక్స్: సాగర్ నారాయణ, నిర్మాత: డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి, దర్శకత్వం: కొండా రాంబాబు.