కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అపూర్వ స్వాగతం ఏర్పాట్లు. ఇవాళ బెంగుళూరు సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్న చంద్రబాబు కోసం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు. చిత్తూరు టిడిపి నాయకుడు జి.జే.ఎమ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గురజాల జగన్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఫ్లేక్సిలు,స్వాగత తోరణాలు ఏర్పాటు. రోడ్డుకి ఇరు వైపులా భారీ ప్లెక్కీలు,స్వాగత తోరణాలు ఎర్పాటు.
Film News
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. పిఏ రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ, స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముట్టడికి కార్మిక సంఘాలు ఐక్యతా కార్యాచరణ పేరిట పిలుపునిచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్దకు చేరుకున్న వేలాది కార్మికులు మరియు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గేటు వద్ద పెద్ద ఎత్తున జిందాల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి తమ సర్వశక్తులు ఒడ్డి పోరాటానికి సిద్ధంగా కార్మికులు ఉన్నారని నాయకులు తెలిపారు. జిందాల్ తో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని వెంటనే కార్మిక సంఘాలకు బహిర్గతం చేయకుంటే అడ్మినిస్ట్రేషన్ ను ముట్టడిస్తామంటూ కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
ప్రేమ కథలు ఎప్పుడు వచ్చినా ఆడియెన్స్ ఆదరిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో గ్రామీణ ప్రేమ కథలు రావడం అరుదుగా మారింది. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటించింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు నిర్మించగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్ సైతం అందరినీ ఆకట్టుకుంది.
ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు. పూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ అందమైన ప్రేమ కథా చిత్రమని కొనియాడారు. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. డిసెంబర్ 29న థియేటర్లోకి వచ్చేందుకు రెడీగా ఉంది.
ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాకు రాఘవేంద్ర కెమెరామెన్‌గా, గౌతమ్ రాజు, నానిలు ఎడిటర్లుగా పని చేశారు. వెంకట్ ఆరే ఆర్ట్ డిపార్ట్మెంట్ను, చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కర భట్ల పాటల రచయితలుగా పని చేశారు. ఈ మూవీ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతంది.
నటీనటులు :
అనురాగ్, అవికా గోర్, పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి తదితరులు
టెక్నీకల్ టీమ్ :
నిర్మాత: కె. కోటేశ్వరరావు
దర్శకత్వం: సత్య ద్వారపూడి
కెమెరా మెన్: రాఘవేంద్ర
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
నేపథ్య సంగీతం : జీవన్ బాబు
ఎడిటింగ్: గౌతమ్ రాజు, నాని
లిరిక్స్ : చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కరభట్ల
ఆర్ట్ : వెంకట్ ఆరే
పీఆర్ఓ: సాయి సతీష్, రాంబాబు
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేలా చేసిన నటుడు, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ శుక్రవారం రిలీజ్ సందర్బంగా థియేటర్ల వద్ద అభిమానుల సందడి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేశారు. ముందుగా సాలార్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద అభిమానులు టపాసులు కాల్చి హంగామా చేశారు. థియేటర్ల వద్ద భారీ ఎత్తున ఫ్లెక్సీలను కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కెపిఎస్ మూవీ థియేటర్ వద్ద అభిమానులు సినిమా పోస్టర్ కు హారతులు ఇచ్చి టెంకాయలు కొట్టారు. బాహుబలి మళ్లీ వచ్చాడంటూ నినాదాలు చేశారు. జై రెబల్ స్టార్ జై ప్రభాస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సినిమా పట్టణంలోని రెండు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” డైరెక్టర్ క్రిష్ మనసు దోచుకున్న పాట
-గుండెను తాకుతున్న స్వరాలు- సాహిత్యం
ఆర్.పి.ఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాగుల ప్రసాదరావు నిర్మాణ సారథ్యంలో యువ ప్రతిభాశాలి వేణు గుడిపెల్లి దర్శకత్వం వహించిన ‘యువరైతు’ స్వతంత్ర సినిమాలోని పాటని ప్రముఖ దర్శకుడు , యువతరానికి దార్శనికుడు జాగర్లమూడి క్రిష్ తన ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో మధుర ఆడియో ద్వారా విడుదల చేసారు. ఈ చిత్రానికి ప్రభాకర్ దమ్ముగారి సంగీత దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలోని పాటని, అందులోని సాహిత్యాన్ని విన్న తరువాత క్రిష్ మాట్లాడుతూ… “రైతుకి కన్నతల్లి.. నేల తల్లి ఇద్దరూ ఒకటే అని… కష్టమైనా నష్టమైన విడువడు ఎన్నటికి అని.. అధ్బుతంగా వ్యసాయాన్ని, సాయాన్ని కొత్తగా అభివర్ణించారని…అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ప్రభాకర్ దమ్ముగారిని, సాహిత్యాన్ని అందించిన దర్శకుడు వేణు గుడిపెల్లి గారిని ప్రత్యేకంగా అభినందించారు.
వ్యవసాయ పట్టబద్రుడి అందమైన హృద్యమైన ప్రేమ కథని, వ్యవసాయాన్ని జోడించి తీసిన చిత్రమిదని, భూమిని నమ్ముకున్న నాన్న చనిపోయాక.. అదే భూమిని నమ్మిన కొడుకు ఏం చేశాడు? ప్రస్తుత సమాజంలో రైతు విలువని గుర్తు చేసే చిత్రమిదని దర్శకుడు వేణు గుడిపెల్లి వివరించారు.
నిర్మాత రాగుల ప్రసాద్ రావు మాట్లాడుతూ… ఈ సినిమా ప్రతి రైతుదే కాదు, అన్నం విలువ తెలిసిన ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా” అన్నారు
సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ముగారు మాట్లాడుతూ… “ఇందులో ఉన్న భావోద్వేగాలు అద్భుతమని, ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళే సినిమా” అని వివరించారు!!
Read Also..
చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద చాణక్య, ఈశ్వర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాచరికం’. విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్గా రాబోతోన్న ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని, దర్శకత్వాన్ని వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా.. నిర్మాత డీఎస్ రావు కెమెరా ఆన్ చేశారు. నిర్మాతలు చాణక్య, కిరణ్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రానికి వెంకి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరా మెన్ గా పని చేశారు. ఈ మూవీకి జేపీ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ.. ‘చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ మీద రాచరికం అనే సినిమాను తీశాం. ఈ మూవీ గ్లింప్స్ ప్రస్తుతం మంచి రెస్సాన్స్ దక్కించుకుంది. గ్లింప్స్‌లో వెంకి ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఇకపై కంటిన్యూగా అప్డేట్లు ఇస్తుంటాం. నాకు సహకరించిన టీంకు థాంక్స్. ఈ రోజు మా ఈవెంట్‌కు గెస్టులుగా వచ్చిన రాజ్ కందుకూరి, డీఎస్ రావులకు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు సురేష్‌తో ఆరు నెలలుగా ప్రయాణించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీ తరువాత పనిచేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది’ అని అన్నారు.
విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచీ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. మా టైటిల్ చూసి బోయపాటి శ్రీను గారు పర్సనల్‌గా మెసెజ్ పెట్టారు. సురేష్ గారి ప్యాషన్ ఈ మూవీతో అందరికీ తెలుస్తుంది. గత ఏడు నెలలుగా దర్శక నిర్మాతలు ఈ మూవీ మీదే ఫోకస్ పెట్టారు. ఇలాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్. వారి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. అప్సరా గారు ఆర్జీవీ సినిమాతో ఫేమస్ అయ్యారు. ఇందులో ఆమె చాలా కొత్తగా కనిపిస్తారు. మేం రెట్రో లుక్‌లో కనిపిస్తాం. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు’ అని అన్నారు.
అప్సరా రాణి మాట్లాడుతూ.. ‘చిల్ బ్రోస్ సంస్థ నన్ను ఈ పాత్ర కోసం అప్రోచ్ అయింది. కథ విన్నప్పుడే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్మాను. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. రాచరికంతో అరాచకం సృష్టించబోతోన్నామ’ని అన్నారు.
ప్రాచీ థాకర్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో విప్లవ అనే పాత్రను పోషించారు. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. మా సినిమాను అందరూ ప్రోత్సహించండి’ అని అన్నారు.
విజయ రామరాజు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం నేను నెగెటివ్ పాత్రలో కనిపిస్తాను. ఈ కథను, పాత్రను దర్శకుడు నాకు చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపిచించింది. మా యంగ్ ప్రొడ్యూసర్స్ చాణక్య, కిరణ్‌లకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఈ చిత్రంలో విజయ్ శంకర్, అప్సరా రాణి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
నటీనటులు : విజయ్ శంకర్, అప్సరా రాణి, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : ఈశ్వర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చాణక్య
కథ, స్క్రీన్, దర్శకత్వం : సురేష్ లంకలపల్లి
కెమెరామెన్ : ఆర్య సాయి కృష్ణ
సంగీతం : వెంకీ
ఎడిటర్ : జేపీ
పీఆర్వో : సాయి సతీష్
విజయ్ దేవరకొండకు అర్జున్‌రెడ్డి తరువాత గీత గోవిందం సినిమా ఎలాంటి ఇమేజ్ తెచ్చిందో, విరాజ్ అశ్విన్‌కు బేబి తరువాత జోరుగా హుషారుగా అలాంటి చిత్రమవుతుంది: దర్శకుడు అనుప్రసాద్
యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ కథానాయిక. అను ప్రసాద్ దర్శకుడు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం రేపు డిసెంబరు 15న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు అనుప్రసాద్తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
దర్శకుడిగా తొలిసినిమా టెన్షన్‌గా వుందా?
సినిమా మీద వున్న నమ్మకం వున్న ఎదో తెలియని టెన్షన్ వుంది. ఎందుకంటే దర్శకుడిగా పరిచయం కావడమనేది నా ఎనిమిదేళ్ల కల. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. తప్పకుండా సినిమా అందరిని అలరిస్తుందనే విశ్వాసం వుంది.
మీ నేపథ్యం ఏమిటి?
ఈస్ట్ గోదావరి జిల్లాలోని పెద్దాపురం మాది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అందుకే చదువు పూర్తయిన తరువాత జాబ్ వదిలేసి సినిమా రంగంలోకి వచ్చాను. అవకాశం కోసం లైట్‌మెన్‌గా, జూనియర్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశాను. షార్ట్ ఫిలింస్‌లో నా ప్రతిభ చూసి దర్శకుడిగా నిరీష్‌గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు.
జోరుగా హుషారుగా ఎలాంటి చిత్రం?
ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎమోషన్, కామెడీతో పాటు మంచి సంగీతంతో కూడిన సినిమా ఇది. సాధారణ జీవితంలో ఒక మిడిల్‌క్లాస్ అబ్బాయికి జరిగే అన్ని సంఘటనలు ఈ చిత్రంలో వుంటాయి. విలేజ్ నుంచి సిటీకి వచ్చిన సంతోష్ అనే కుర్రాడు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటాడు? దాని వల్ల అతని జీవితంలో జరిగే మార్పులేమిటి? అనేది ఆసక్తికరంగా వుంటుంది. తనకు ఎదురైన సంఘటనల నుంచి అతను ఎలా బయటపడ్డాడు ? తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు అనేది ఎమోషన్‌తో కనెక్ట్ వుంటూనే ఎంటర్టైన్మెంట్ వేలో చూపించాను
సాయికుమార్ గారి పాత్ర ఎలా వుంటుంది?
సూర్య నారాయణ అనే చేనేత కార్మికుడు పాత్రలో కనిపిస్తాడు. ప్రేమను మనసులో దాచుకుంటాడు. చిత్రంలో ఈ పాత్ర కీలకంగా వుంటుంది. విరాజ్‌కు తండ్రి పాత్రలో కనిపిస్తాడు.
ఈ చిత్రంలో కొత్తదనం ఏమిటి?
ఈ చిత్రంలో వుండే ఓ యూనిక్ పాయింట్, ఎమోషన్ ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి కనెక్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఏ సినిమాలో టచ్ చేయని ఓ పాయింట్‌ను ఇందులో టచ్ చేశాం. ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ ఈ చిత్రంలో వుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుతూ థియేటర్ నుంచి బయటికొస్తారు.
జోరుగా హుషారుగా టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
సినిమాలో పాత్రలన్నీ సరదాగా వుంటాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కూడా హ్యపీగా వుంటారు. అందుకే ఆ టైటిల్ పెట్టాం.
బేబి లాంటి ఓ కల్ట్ లవ్‌స్టోరీ తరువాత విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవుతుందా?
విజయ్ దేవరకొండకు అర్జున్‌రెడ్డి తరువాత గీత గోవిందం సినిమా ఎలాంటి ఇమేజ్ తెచ్చిందో, విరాజ్ అశ్విన్‌కు బేబి తరువాత జోరుగా హుషారుగా అలాంటి చిత్రమవుతుంది.
Read Also….
ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్న సినిమా తికమకతాండ. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనే కథాంశం. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ అన్నిటికీ మంచి స్పందన లభిస్తోంది.
నిర్మాత తిరుపతి శ్రీనివాస్ మాట్లాడుతూ : ట్విన్స్ రామ్ హరి హీరోలుగా ఒక కొత్త ప్రయోగంతో ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. వేరే బిజినెస్ లు చేస్తున్న మా పిల్లలకి సినిమా పైన ఉన్న మక్కువతో వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాని నిర్మించాం. ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చాడు. మనందరికీ తెలుసు ఊరంతా మతిమరుపు ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళు పడే ఇబ్బందులు బాధలు ఎలా ఉంటాయి. కామెడీగా ఉంటూనే మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యి రాజన్న సినిమాతో పేరు తెచ్చుకున్న యాని మరియు రేఖా నిరోష ఈ సినిమాలో హీరోయిన్ లు గా చేయడం జరిగింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరి నుండి డిఓపి హరికృష్ణన్ వర్క్ చాలా బాగుంది అన్న ప్రశంసలు వచ్చాయి. ధైర్యంగా మేము ముందడుగు వేసి డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా చూపించగా వారికి సినిమా చాలా నచ్చింది. టీ ఎస్ ఆర్ మూవీ మేకర్స్ చిత్రీకరించిన తికమక తండా సినిమాని డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము అన్నారు.
దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ : నన్ను నా కథని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన తిరుపతి శ్రీనివాస్ రావు గారికి కృతజ్ఞతలు. హీరోలు హరికృష్ణ, రామకృష్ణ హీరోయిన్లు యాని, రేఖ చాలా బాగా నటించారు. మ్యూజిక్ చాలా బాగా వచ్చింది సిద్ శ్రీరామ్ పాడిన పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. తెలంగాణలోని ఒక మంచి విలేజ్ నెట్వర్క్ లేని చోట అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమాని చిత్రీకరించాం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన వస్తుండడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ నెల 15న థియేటర్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మా సినిమాని ప్రేక్షకులు అందరూ చూసే ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
తిరుపతిసత్యం సమర్పించు
నిర్మాణం: టి ఎస్ ఆర్ మూవీమేకర్స్
నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు
దర్శకుడు : వెంకట్
తారాగణం : హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్
కథ : నిరూప్‌కుమార్
డి ఓ పి : హరికృష్ణన్
ఎడిటర్ : కుమార్ నిర్మలాసృజన్
సంగీత దర్శకుడు : సురేష్ బొబిల్లి
పి ఆర్ ఓ : మధు వి ఆర్