రాజకీయ నాయకులు విదేశీ పర్యటనలు తరచుగా చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కూడా ఐదేళ్లలో నాలుగు ఐదు సార్లు ఏదో ఒక కార్యక్రమం పేరుతో అమెరికా వెళ్ళొస్తుంటారు. ఇక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైతే చెప్పనక్కర్లేదు. కానీ కేసీఆర్ వీటన్నింటికీ వ్యతిరేకం .దేశంలోనే అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి. రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన ఆయన పర్యటించిన దేశాలు రెండు మాత్రమే. ఒకటి ముఖ్యమంత్రి అయిన కొత్తలో సింగపూర్ పర్యటించారు. రెండు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు చైనా పర్యటన చేశారు.ఇవి కాకుండా ఆయన జీవితకాలంలో ఎప్పుడు దేశాన్ని దాటలేదు.
కానీ ఇప్పుడు కేసీఆర్ అమెరికా వెళ్ళబోతున్నారు . ఒకటి రెండు నెలల్లో ఆయన అమెరికా ప్రయాణం. కొన్ని రోజులుగా కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారు. మొదట్లో అనారోగ్య కారణాలు, ఆ తర్వాత ఫామ్ హౌస్ లోనే రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడికే పరిమితమయ్యారు. ఇప్పుడు అమెరికా వెళ్లి నెల రెండు నెలలు ఉండే అవకాశం కన్పిస్తుంది . ఇప్పటికే కేసీఆర్ మనవడు హిమాన్షు అమెరికాలో చదువుకుంటున్నాడు . మనవడి కోరిక మేరకే తాత కేసీఆర్ అమెరికా వెళుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు అక్కడే రెస్ట్ తీసుకోవాలని ఈ మధ్యకాలంలో ఇండియా వచ్చిన హిమాన్షు కోరినట్లు సమాచారం. కేసీఆర్ అమెరికా షెడ్యూల్ ని రెడీ చేస్తున్నారు బీ ఆర్ ఎస్ నాయకులు .
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
- ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 62168