ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంత్రి పర్యటించారు. రవాణా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల పరిమితి ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్స్ లో అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇచ్చిన అన్ని హామీలను వంద రోజుల్లోనే నెరవేరుస్తామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఏ విధంగా ఇచ్చిందో అదే మాదిరిగానే ఇస్తామని స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహించినా ఏనాడు ప్రజలను కలవలేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
Ghazwal
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమ నియోజకవర్గాల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్లో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం కామారెడ్డిలో బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.గజ్వేల్ లో ఐవోసీ మైదానం వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సీఎం వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో గజ్వేల్ చేరుకుంటారు. అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎం గారితో గజ్వేల్ లో ఈనెల 28 తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.2014, 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో జరిగింది.



Total views : 80105