వలసపాకల గానుగ చెట్టు సెంటర్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి తిరగతి వీరభద్రరావు ఇంటిలో చోరీ జరిగింది. సుమారు 40 కాసుల బంగారం,1లక్షా 50వేల నగదు దుండగులు ఎత్తుకు పోయారు. తుఫాన్ ప్రభావంతో కరెంట్ లేక నెట్ లేక పోవడంతో సాప్ట్ వేర్ ఉద్యోగి అయిన వీరభద్రరావు సోమవారం సాయంత్రం 4 గంటలకు భార్యతో కలిసి గుడారి గుంట అత్తవారింటికి వెళ్ళి ఈ రోజు ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండడంతో సర్పవరం పోలీసులకు వీరభద్రరావు సమాచారం అందించాడు. చోరీ జరిగిన ఇంటిని సర్పవరం సి ఐ మురళి కృష్ణ, మరియు కాకినాడ డిఎస్పీ మురళీ కృష్ణ రెడ్డి, క్రైమ్ డిఎస్పీ రాంబాబు, ఐటి కోర్ శ్రీనివాస్ పరిశీలించారు.
Gold theft
పుత్తూరు నుండి బెంగళూరుకు వెళ్లే బస్సులో పుల్లూరు క్రాస్ నుండి తానా చెక్పోస్ట్ రోడ్డు మధ్యలో బస్సులో ప్రయాణిస్తున్న అనసూయ అనే మహిళ వద్ద బంగారు నగలు దొంగలించిన కేసులో ముద్దాయిని 27 సంవత్సరాల వయసు కలిగిన రాధికను అరెస్ట్ చేసినట్లు నగరి డి.ఎస్.పి రవికుమార్ తెలిపారు. ఆయన కదనం మేరకు చిత్తూరు నగరంలోని మంగసముద్రం లెనిన్ నగర్ కాలనీకి చెందిన 27 సంవత్సరాల వయసు కలిగిన రాధిక బస్సులో ప్రయాణిస్తున్న అనసూయ వద్ద నుంచి 32 గ్రాముల నల్లపూసలు, 16 గ్రాముల ముత్యాల దండ, 22 గ్రాముల నెక్లెస్, 10 గ్రాముల లక్ష్మీ డాలరు, 32 గ్రాముల రాళ్ల గాజులు, 48 గ్రాముల సాదా గాజులు, 13 గ్రాముల బ్రేస్ లైట్, ఐదు గ్రాముల ముత్యాల పగడాలు, మూడు జతల 22 గ్రాముల బరువు కలిగిన బుట్ట కమ్మలు, తొమ్మిది గ్రాముల రాళ్ల కమ్మలు, 11 గ్రాముల డాలరు పగడాల దండ, 21 గ్రాముల ఉంగరాలు, బంగారు పట్టి కలిగిన 15 గ్రాముల వాచ్.. మొత్తం 262.98 గ్రాముల సొత్తును స్వాధీనం చేసుకొని నిందితురాలని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈమె పైన ఆరు కేసులు ఉన్నాయని, పూతలపట్టు కల్లూరు కాణిపాకం గుడిపాల సోమల చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో కార్వేటి నగరం సిఐ సత్తిబాబు ఎస్ఆర్ పురం ఎస్సై షేక్షావల్లి సిబ్బంది పాల్గొన్నారు.
Read Also..
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గత నెలలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేదించారు. కేసుకు సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 9 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ మీడియాకి తెలిపారు. తణుకు పట్టణానికి చెందిన బంగారు వ్యాపారి ఇంట్లో గత నెల 12వ తేదీన ఐదుగురు దుండగులు చొరబడి వ్యాపారితో సహా కుటుంబ సభ్యులందరినీ తాళ్లతో బంధించి చోరీకి పాల్పడ్డారు. వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్ర పోలీస్ అధికారులు ఆదేశాల మేరకు జిల్లా అధికారుల సూచనలతో తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన పోలీసులు దర్యాప్తులో పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన నిందితులు ఇటువంటి చోరీలకు పాల్పడతాయని తెలిసి పోలీస్ బృందాలు మహారాష్ట్ర తరలి వెళ్లాయి. ఐదు రోజులపాటు మహారాష్ట్రలో పోలీసులు విచారించి అసలు నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ప్రధానమైన జతిన్ అనే వ్యక్తి చాలా చోరీల్లో ఆరితేరిన వ్యక్తి అని గుర్తించారు. అతనితోపాటు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయలు పైగా విలువైన 9 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు పూర్వపరాలను వివరించిన జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. వీరిద్దరికీ సహకరించిన మరో ముగ్గురిని గతంలోనే అరెస్టు చేసినట్లు వివరించారు. తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన పోలీసులు దర్యాప్తునకు మహారాష్ట్రకు చెందిన పోలీస్ అధికారులు కూడా సహకరించారని చెప్పారు. వీరందరితోపాటు ఫిర్యాదుదారుడైన బంగారం దుకాణం యజమాని సహకారం కూడా తీసుకొని కేసును చేదించగలిగామని ఎస్పీ రవి ప్రకాష్ వెల్లడించారు.





Total views : 79585