హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు . పలు కాలనీల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఇండ్లలోకి చొరబడడం స్థానికంగా కలకలం రేపుతోంది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని శ్రీనివాస్ నగర్ లో మహిళలు రాత్రంతా భయంతో నిద్రపోకుండా ఇండ్ల ఎదుట కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పురుషులంతా కర్రలతో కాలనీలో తిరుగుతూ గస్తీలు కాస్తున్నారు. హిందీ భాష మాట్లాడుతున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ఇళ్లల్లోకి చొరబడి బెదిరించారని పలువురు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లలోకి వచ్చి బెదిరిస్తున్న సమయంలో చుట్టుపక్కల కాలనీవాసులు అప్రమత్తమై కేకలు వేస్తూ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పరారయ్యారన్నారు. మధ్యాహ్నం వేళ కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటున్నరన్నారు. గ్రామంలోని పశువుల ఆస్పత్రి, చేపల మార్కెట్ లను రాత్రివేళ స్థావరాలుగా చేసుకొని పక్కా ప్రణాళికతో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారాన్ని పోలీసులు కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం …తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ జోరందుకుంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. పశ్చిమ బెంగాల్ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని…
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..గంజాయి తరలిస్తున్న ముఠాను సికింద్రాబాద్ జీఆర్పీ,ఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి పద్దెనిమది లక్షలకు పైగా విలువైన 36 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్…
- మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..ప్రేమ,పెళ్ళి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా వేధించి, బ్లాక్ మెయిల్ కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ కి చెందిన సంతోష్ మేడ్చల్లోని సిఎంఆర్ కాలేజీలో బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న…
- ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్..ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదని అయినా రైతులకు ఇబ్బంది లేకుండా మేమే కొంటున్నామని ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న ఆరోపణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ధాన్యం సేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ…
- మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి .10th లో 582 మార్కులు సాధించిన విద్యార్థిని భవిత..తన ఆర్ధిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పాలిసెట్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 89152