హన్మకొండ జిల్లాలో కలకలం రేపుతున్న వరుస చోరీలు . పలు కాలనీల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఇండ్లలోకి చొరబడడం స్థానికంగా కలకలం రేపుతోంది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని శ్రీనివాస్ నగర్ లో మహిళలు రాత్రంతా భయంతో నిద్రపోకుండా ఇండ్ల ఎదుట కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పురుషులంతా కర్రలతో కాలనీలో తిరుగుతూ గస్తీలు కాస్తున్నారు. హిందీ భాష మాట్లాడుతున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ఇళ్లల్లోకి చొరబడి బెదిరించారని పలువురు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లలోకి వచ్చి బెదిరిస్తున్న సమయంలో చుట్టుపక్కల కాలనీవాసులు అప్రమత్తమై కేకలు వేస్తూ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పరారయ్యారన్నారు. మధ్యాహ్నం వేళ కాలనీల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటున్నరన్నారు. గ్రామంలోని పశువుల ఆస్పత్రి, చేపల మార్కెట్ లను రాత్రివేళ స్థావరాలుగా చేసుకొని పక్కా ప్రణాళికతో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారాన్ని పోలీసులు కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 199104