హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో సంచలనం రేపిన నకిలీ గోల్డ్ మ్యాన్ గుట్టు రట్టైంది. అత్తాపూర్‌కు చెందిన సూర్య భాయ్ అలియాస్ సురేష్ కుమార్ భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ… అవి అసలు బంగారం కాదని ఐటీ అధికారులు తేల్చారు. విచారణలో భాగంగా ధరించిన ఆభరణాలను పరిశీలించగా… అవి కేవలం రాగి, వెండిపై గోల్డ్ కోటింగ్ చేసినవని బయటపడింది. సుమారు కోటి రూపాయల విలువ ఉందని చెప్పుకున్న నగలు.. అసలు విలువ కేవలం మూడు లక్షలేనని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
Tag: