ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురి అవుతున్నారు. కాగా, సీట్లల్లో మార్పులు చేర్పులపై వైసీపీ కసరత్తు చేస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వెళ్లారు. కాగా, ఇప్పటికే రాయలసీమకు చెందిన మరికొందరు నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎమ్మెల్యే కిలారు రోశయ్య, ఉమ్మారెడ్డిలతో పాటు మంత్రి ఉషశ్రీ చరణ్ కు కూడా పిలుపు రావడంతో ఆమె కూడా వెళ్లారు. ఈ మార్పుల తర్వాత ఎన్నికల కోసం వైసీపీ పార్టీ కసరత్తు చేయనుంది. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురి వైసీపీ సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో అవకాశం రాకపోవచ్చు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, అనంత జిల్లాల్లో మార్పులపై సెకండ్ ఫేజ్ ఎక్సర్ సైజ్ కొనసాగుతుంది. గత వారం నుంచి ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీసుకు 30-35 మంది ప్రజా ప్రతినిధులు క్యూ కట్టారు. అలాగే, పలువురు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా సీఎం జగన్ అవకాశం ఇవ్వనున్నారు. మరి కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తుంది.
krishna
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం మద్దూరు, కాసరనేని వారి పాలెం గ్రామాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, అరటి పొలాలను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ బలశౌరి మాట్లాడుతూ తుఫాను వలన 70 నుంచి 80 శాతం వరకు రైతులకు పంట నష్టం జరిగిందని అన్నారు. చేతికి వచ్చిన పంట నేలపాలు అవ్వడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. పంట నష్ట సేకరణ త్వరగా సేకరించాలని అధికారులకు సూచించారు. అలాగే కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఆదుకుంటుందన్ని అని కేంద్ర ప్రభుత్వాలు కూడా విపత్తు సమయాల్లో రైతులను ఆదుకోవాలి అని అవసరమైన చట్ట సవరణ కూడా చేయాలి అని అన్నారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్ని, రైతు దగ్గర నుంచి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ధాన్యం సేకరణలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది. లేదు అని ఇనుమురేషన్ సమయంలో అధికారులు ఉదారంతో ఉండి పంట నష్ట వివరాలు సేకరించాలి అని ఆయన తెలిపారు. రైస్ మిల్లర్లు రైతులను నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దు అని అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ధాన్యం సేకరణ విషయంలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. శనివారం శ్రమ శక్తి భవన్లో హైబ్రిడ్ మోడ్లో తెలుగు రాష్ట్రాల అధికారులతో దాదాపు గంటకుపైగా కేంద్ర జలశక్తి శాఖ అధికారుల సమావేశం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల సమస్యలపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో ఏపీ, తెలంగాణ అధికారులు విడుదల చేస్తారని సెంట్రల్ వాటర్ కమీషన్ ఛైర్మన్ వెల్లడించారు
కృష్ణా జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు సూచించారు. నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన జిల్లా సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజీపీ మళ్లీ అధికారం చేపట్టకుండా చేయడమే తమ పార్టీ విధానమని అన్నారు. సామాజిక సాధికారిత పేరిట బస్సు యాత్ర చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను రద్దు చేసిన కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. సబ్ ప్లాన్ను కేంద్రం రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు రావాల్సిన వాటా తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం. గన్నవరం జాతీయ రహదారి నాలుగు రోడ్లు కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
పాత గన్నవరం నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో టిప్పర్ క్వారీ లారీ లోడుతో ఒక్కసారి గా జాతీయ రహదారిపై దూసుకు రాగా, ఏలూరు నుంచి విజయవాడ వెళ్లే కంటైనర్ బాక్స్ లారీ టిప్పర్ లారీని ఢీకొట్టిన వైనం జాతీయ రహదారిపై విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే మూడు లారీలు వరుసగా టిప్పర్ తప్పించబోయి రోడ్డు మధ్యలో ఉన్న రైలింగ్ పై దూసుకు వెళ్ళాయి. తెల్లవారు జాము కావడంతో జాతీయ రహదారిపై జనసంచారం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహాయంతో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా సహాయక చర్యలు చేపట్టిన గన్నవరం పోలీసులు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు
గన్నవరం లోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లలో ప్రమాదవశాత్తు ఆటోమొబైల్ షాపులో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ షాపు యజమాని మడతల గురువారెడ్డి గా గుర్తింపు. గన్నవరం బీట్ పోలీసుల సహాయంతో సమాచారం అందుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేశారు. పూర్తిగా దగ్ధమైన ఆటోమొబైల్ షాపులోని స్పేర్ పార్ట్స్ సామాన్లు. అర్ధరాత్రి కావడంతో మూసివేసిన ఆటోమొబైల్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరాగడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
జగ్గయ్యపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం, ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య NTR జిల్లా జగ్గయ్యపేట మండలం లోని పత్తి, మిర్చి, వరి తదితర పంటల సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్న టీడిపి నేతలు విత్తనం దగ్గర నుంచి ఎరువులు, మందులు, నాట్లు, కలుపులు తీసి వరికి 40వేలు, పత్తికి 50వేలు, మిర్చికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి చివరకు సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతున్న రైతులను ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోని ప్రభుత్వం, ప్రకృతి వైపరీత్యాల క్రింద నిధిని ఏర్పాటు చేస్తామని, పంటల భీమా పథకాన్ని కల్పిస్తామని ఎన్నికల ముందు వాగ్దానం విస్మరించి కనీసం రైతులకు సాగునీరు అందించలేని, ఈ ప్రభుత్వం విధానాలను ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రైతు సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జగ్గయ్యపేట మండలంలో రెడ్డి నాయక్ తండా, అన్నవరం గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలన. నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ రైతుల ఆందోళనను వైయస్సార్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రెడ్డినాయక్ తండాలో 40 సంవత్సరాల క్రితం ఉన్న స్కీం పట్టించుకోకుండా సాగునీరు అందకపోవడం వల్ల జగ్గయ్యపేట మండలంలో సుమారు వరి 200 ఎకరాల్లో మిరప 150 ఎకరాల సుమారు పంట ఎండిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంకా ఇతర పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మోటర్లు పెట్టి సాగునీరు పంట పొలాలకు ఇవ్వాలన్నా సరిపడా కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది. మొన్న క్యాబినెట్ సమావేశంలో కనీసం రైతుల గురించి ఆలోచించని జగన్ ప్రభుత్వం రైతులను కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వారి తాబేదారులకు లంచం చేకూర్చడంలో ఉన్న ఉత్సాహంలో 10% అయినా రైతులుపై పెట్టాలి. జగ్గయ్యపేట మండలంలో జరిగిన పంట నష్టాన్ని అధికారులు వెంటనే సర్వే చేసి వారికి పంట నష్టం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తాతయ్య మాట్లాడుతూ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల రైతులకు కంట కన్నీరు మిగిలింది. మిర్చి, వరికి రైతులు పెట్టుబడి పెట్టి నీరంధక నష్టపోయారన్నారు. చంద్రబాబు నాయుడు హాయంలో ముక్త్యాల స్కీమ్ శంకుస్థాపన చేసి రైతులకు సాగునీరు అందించాలని కృషి చేస్తే, ఈ ప్రభుత్వం స్కీం స్థలాన్ని వేదాద్రి కి మార్చి పనులు ఆపు వేయడం వల్ల రైతులు సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వంలో కంచెల-వేదాద్రి స్కీం ఆగిపోవడం జరిగింది. బూదవాడలో నెట్టెం రఘురాం హాయంలో స్కీమ్ ఏర్పాటు చేశారు. నిధులు లేవని వంకచూపి వైసిపి ప్రభుత్వం స్కీం ఆపివేయడం జరిగిందన్నారు. నిర్లక్ష్యం, సరైన ఆలోచన లేకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టం చవిచూస్తున్నారు. జగ్గయ్యపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను పూర్తిగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్.





Total views : 90110