పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ నెల 19న వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఏపీలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద సందడి మొదలైంది. బ్లాక్‌బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పుడు సినిమా సందడి మొదలైంది. ఏపీలోని పలు సినిమా హాళ్లు నెమ్మదిగా అడ్వాన్స్ బుకింగ్స్‌ను తెరుస్తున్నాయి. ఇందులో బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. త్వరలోనే అన్ని థియేటర్లలోనూ బుకింగ్స్ పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి. అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. నేడు హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘సంతోషం’ చిత్ర దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించడం విశేషం.
Latest Movie
ఎఫ్ ఎన్ సి సి (FNCC) పన్నెండవ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ 9/3/2024 ప్రారంభమై 11/3/2024 న ముగిసినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఫ్ ఎన్ సి సి ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు, డైరెక్టర్ బి. గోపాల్ గారు పాల్గొన్నారు. అలానే ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ పెద్ది రాజు గారు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి గారు, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ గారు, జె బాలరాజు గారు, శైలజా జుజల గారు, ఏడిద రాజా గారు, సామా ఇంద్రపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన నెస్ట్ ఇన్ టీం చెన్నై గ్రూప్, నవయుగ ట్రోఫీ మరియు క్యాష్ ప్రైస్ ని గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ కి మెయిన్స్ స్పాన్సర్ గా నవయుగ ఇంజనీరింగ్ వారు వ్యవహరించారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
ఇదిచదవండి : ఘనంగా ‘జయం’ ఫస్ట్‌లుక్ లాంచ్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
లవ్ గురు (Loveguru) మూవీ:
వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. తన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో. విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న రోమియో మూవీ తెలుగులో “లవ్ గురు (Loveguru)” పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. “లవ్ గురు” సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇవాళ ఈ సినిమా నుంచి ‘చెల్లెమ్మవే..’ అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. భరత్ ధనశేఖర్ సంగీతాన్ని అందించగా..ఆదిత్య ఆర్కే పాాడారు. ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..నా చెల్లివే..నువు నా చెల్లివే..నేనున్నదే నీ కోసమే..విధి రాసెనే, ఒక రాతనే…ఆ ఆటలో ఎద కృంగెనే..’ అంటూ హీరో తన సోదరిని తల్చుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలతో ఎమోషనల్ గా సాగుతుందీ పాట. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “లవ్ గురు” సినిమాలో హార్ట్ టచింగ్ సెంటిమెంట్ కూడా ఉంటుందని ఈ పాటతో తెలుస్తోంది. “లవ్ గురు” సినిమాను సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
నటీనటులు – విజయ్ ఆంటోనీ, మృణాళినీ రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – ఫరూక్ జే బాష
సంగీతం -భరత్ ధనశేఖర్
ఎడిటింగ్, నిర్మాత – విజయ్ ఆంటోనీ
బ్యానర్ – విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్
సమర్పణ – మీరా విజయ్ ఆంటోనీ
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
రచన దర్శకత్వం – వినాయక్ వైద్యనాథన్
మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్చేయండి





Total views : 194686