అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మదుపర్లలో ఆందోళన రేకెత్తించాయి. దీంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు కుప్పకూలాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,048 పాయింట్లు నష్టపోయి 80 వేల 239 వద్ద స్థిరపడింది. ఇది సెప్టెంబర్ 2025 తర్వాత సెన్సెక్స్ నమోదైన కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. నిఫ్టీ కూడా313 పాయింట్లు కోల్పోయి 24 వేల 866 వద్ద ముగిసింది. మార్కెట్లో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతూ.. కొన్ని షేర్లు మాత్రమే లాభాల్లో ముగియగా.. మరికొన్ని షేర్లు నష్టంతో టాప్ లూజర్‌గా నిలిచాయి. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలోనూ ఒత్తిడి కనిపించింది. అయితే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ మాత్రం 0.24 శాతం లాభపడి సానుకూలంగా ముగిసింది. ప్రస్తుత మార్కెట్ సరళిపై నిపుణులు స్పందిస్తూ.. నిఫ్టీకి 24 వేల 600 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉందని తెలిపారు. ఈ స్థాయిని కోల్పోతే మార్కెట్లు మరింత పతనం అయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఎగువన 25 వేల పాయింట్ల వద్ద నిరోధం ఉందని, నిఫ్టీ ఆ స్థాయి పైన స్థిరపడే వరకు బేర్స్ ఆధిపత్యం కొనసాగవచ్చని విశ్లేషించారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ప్రధాన సూచీల కంటే ఎక్కువగా నష్టపోయాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారని, లాభాల స్వీకరణ వైపు చూస్తున్నారని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Tag:
market
ఎర్ర బంగారం(Red Gold)తో వరంగల్ ఎనుమాముల(Warangal Enumamula) మార్కెట్(Market) కళకళలాడుతున్నా, రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. నాణ్యత లేదని ధరను వ్యాపారులు తగ్గించేస్తున్నారని కర్షకులు వాపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను మార్కెట్‌కు తీసుకొస్తే.. గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు దక్కడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎనుమముల వ్యవసాయ మార్కెట్ నుంచి మిర్చి రైతులు(Chilli Farmers) పడుతున్న ఇబ్బందుల పై తాజా సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ కిశోర్ అందిస్తారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఎస్పీ కీలక ప్రకటన… వనం వీడి జనంలోకి రండి
- ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
- తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి