ఏపీలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ చేస్తామని తెలిపారు. ఈ నెల 16 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అక్టోబరు 1 నాటికి వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని రాధికా రెడ్డి తెలిపారు. అన్ని వైద్య కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రం మొత్తం మీద 35 మెడికల్ కాలేజీల్లో 6,210 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అందులో ఎంబీబీఎస్ ‘ఏ’ కేటగిరీ కింద 3,856 సీట్లు కేటాయించామని వివరించారు. సీట్ల భర్తీ కోసం మూడు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. అటు, రాష్ట్రవ్యాప్తంగా 1,540 బీడీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. వైద్య విద్యా కోర్సుల్లో సీట్ల కోసం ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 197028