బిల్డింగ్ పై కూర్చున్న ప్రజలను సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి చూపెట్టండి మీరు నాకు కనబడాలి. ఎగువ ప్రాంత రైతులకు ఒక కల ఉండేది. ఎప్పుడు ఎర్రటి ఎండల్లో ఎగువ నర్మాల మనేర్ మత్తడి దుకుతుంది అని అనుకున్నారా ఆ కళా సాకారం ఇప్పుడు అయ్యింది. ఒకప్పుడు కరెంటు లేక పవర్ హాలిడే ప్రకిటించేది. కానీ ఇప్పుడు 24 గంటల కరెంటు ఉండడంతో వలసలు తగ్గాయి. కరెంటు గురించి కాంగ్రెస్ కు మాట్లాడే హక్కు లేదు. 30 తేదీన బటన్ నోక్కే టప్పుడు ఒకటే ఆలోచన చేయండి 24 గంటల కరంటు కావాలా, 3 గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా ఆలోచన చేసి ఓటు వేయండి. రేపు లేదా ఎల్లుండి రైతు బందు డబ్బులు పడుతాయి, టింగు టింగు మని మేసేజులు వస్తాయి చూడండి. అప్పర్ మనెరు దగ్గర రెండు బ్రిడ్జి లు కట్టిస్తాను. మనేరూ ప్రాజెక్ట్ ను టూరిస్ట్ ప్లేస్ గా మర్చుతాను. మండలంలో ని అన్ని గ్రామాల స్కూల్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వెళ్లకుండా చేస్తాను. మళ్ళీ ఒక్కసారి గెలిపిస్తే దేశం లోనే మన సిరిసిల్ల నియోజకవర్గం ను నెంబర్ వన్ గా నిలబెడతాను. ఇక్కడ ఉన్న కేజీ టు పీజీ స్కూల్లో చేరి పలకతో రండి పట్టాతో వెళ్ళండి. 30 తేదీన కారు గుర్తుకు ఓటు వేయండి భారీ మెజారిటీతో గెలిపించండి. మండలంలో కేంద్రం లో డబుల్ రోడ్డు చేస్తాను, ఏమన్న ఇబ్బంది కలిగితే నష్ట పరిహారం చెల్లిస్తాం.
Minister KTR
సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు గోడమీద రాత అని, కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయం అయిందని తెలిసి, సీఎం కేసీఆర్ మళ్లీ గజ్వేల్ కు పోతున్నారన్నారు. గజ్వేల్ లో సైతం కేసీఆర్ ఓటమి ఖాయమైనని, రానున్న రోజుల్లో ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తారో వేచి చూడాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఇప్పటికైనా తెలుసుకున్నారని, తెలంగాణ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారన్నారు.
వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఓట్లు అడిగే ముందు గతంలో ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ కు పట్టం కడితే నాలుగు కొత్త కార్యక్రమాలు తెస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.కేసీఆర్ బీమా పేరుతో రూ.5 లక్షలు అందిస్తామన్నారు.సౌభాగ్యలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ.3 వేలు అందించడంతో పాటు తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఇంటికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్ లో కేసీఆర్ భరోసా కింద మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.హనుమంతుని గుడి లేని ఊరు లేదన్న కేటీఆర్ బీఆర్ఎస్ సంక్షేమం అందని ఊరు కూడా లేదన్నారు
సంగారెడ్డి లో మంత్రి కేటీఆర్ రోడ్ షో విద్యార్థి, యువజన ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ తరపున ప్రచారం కేటీఆర్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మోసం చేస్తోంది కర్నాకటలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పీకింది డిసెంబర్ మూడు తారీఖున సంగారెడ్డి కి కాబోయే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ కావాలంటా..55 ఏండ్లు ఇచ్చినా ఏం చేశారు మళ్లొకసారి వచ్చి ఏక్ బార్ దో అంటున్నారు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు.. డి కే శివకుమార్ తెలంగాణలో ఐదు గంటల కరెంట్ ఇస్తామంటున్నారు వాళ్లకు ఇక్కడ 24 గంటల కరెంటు కనిపించడం లేదా సంగారెడ్డి నియోజకవర్గం లోని ఏ ఊరిలో నైనా వెళ్లి కరెంటు తీగలు పట్టుకోండి తెలుస్తుంది… కరెంటు ఉందో.. లేదో..కరెంట్ తీగలు పట్టుకోండి దేశం దరిద్రం పోతుంది. తెలంగాణకు ఉన్న ఒకే ఒక గొంతుక కేసీఆర్. కేసీఆర్ ను ఖతం చేసేందుకు చూస్తున్నారు. 55 కిలోల కేసీఆర్ ను కొట్టేందుకు మోడి, అమిత్ షా, రాహుల్ గాంధీ, ఠాక్రే పోటీ ఎందుకు..? కేసీఆర్ గొంతుక పిసికేందుకు షంషేర్ లు తీస్ మార్ ఖాన్ లు వస్తున్నారు. సింహ మెప్పుడు సింగిల్ గానే వస్తుంది, 95 సీట్లలో గులాబీ జెండా ఎగురుతుంది
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా గెలుస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి ఎన్నికల్లో గెలిపిస్తుందన్నారు శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన కేటీఆర్.. తమ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పట్టించుకోవద్దన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా చాలా ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. ప్రవళిక చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మేము ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పామన్నారు.హుజూరాబాద్ లో ఈటెల ఓడిపోతున్నారన్నారు. గజ్వేల్‌లో పోటీ చేసిన ఈటెల గెలవరు’ అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమ నేతలంతా తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ లు ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా జిట్టా తోడుగా ఉన్నారని కొనియాడారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి… ఎన్నికల్లో డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణను ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటోందని… కానీ, ఎన్నో బాధలు పెట్టిన తర్వాతే రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణను ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు.





Total views : 62186