తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తోంది. ఏ పథకం అమలు కావాలన్నా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం అధికారులు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. దీనిలో ఒక్క గ్యారెంటీ అమలు మినహా ఐదు గ్యారెంటీలకు దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వం. వీరు చేసుకున్న దరఖాస్తుల్లో ఎక్కువగా రేషన్ కార్డుల కోసం వచ్చినవి అధికంగా ఉన్నాయి. ప్రజాపాలనలోనే కాదు ప్రజావాణిలోనూ రేషన్ కార్డులు, పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి జాబితాను రెడీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునే వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మంత్రి సీతక్క గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖలను తనిఖీ చేశారు. అయితే బీఆర్ఎస్ సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో కేంద్ర స్కీంలను వినియోగించుకోలేకపోతున్నామని అధికారులు మంత్రి సీతక్కకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకు అర్హులకు రేషన్ కార్డులను మంజూరు చేసే ప్రక్రియ షురూ కానుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్…ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి. ఈ…
- చిలకా ప్రొడక్షన్స్ థ్రిల్లర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్గా మూవీ గ్రాండ్ రిలీజ్..నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా…
- తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు అధికారులు,…
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్..తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్ సృష్టించిన సీఎం విజయ్..తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ, సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 79177