హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చేపట్టిన ఎన్నికల ప్రచారం రెండవ రోజు లేపాక్షి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఫుల్ జోష్ నింపే విధంగా ప్రచారం కొనసాగింది. కొండూరు, కల్లూరు,నాయన పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలయ్య డప్పు కొట్టిన విధానం అక్కడ ఉన్న ప్రజలకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. జై బాలయ్య జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున కేరింతల కొట్టారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ విదేశీ విద్యను జగన్ విదేశీ విద్యగా పేరు మార్చారన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో యువతను గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు చేసి బ్రష్టు పట్టిస్తున్నారు. ప్రస్తుతం గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలన్నీ ఖాళీ చేసి రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దళితులకు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామన్నారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బికే పార్థసారథిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మీ ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖలో కరెన్సీ నోట్ల కుప్ప.విశాఖపట్నంలో కరెన్సీ నోట్లు కుప్పలుగా కనిపించడం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద భారీగా చిరిగిన కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. పార్కు ఎదురుగా కుప్పగా పడి ఉన్న నోట్లను మార్నింగ్ వాకర్స్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.…
- బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తి.గుంటూరు జిల్లా తెనాలిలో ఆశ్రయం ఇచ్చిన బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పి నెల రోజులుగా బంధువు ఇంట్లో ఉంటున్న జాగర్లమూడి భరత్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో…
- పుంగనూరులో భారీ వర్షాలకు పెను ప్రమాదం.అన్నమయ్య జిల్లా పుంగనూరులో భారీ వర్షానికి పెను ప్రమాదం తప్పింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మదనపల్లి రోడ్డులోని ఓ చికెన్ షాప్ పిట్టగోడ, మోల్డింగ్ ప్లేట్ ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా.. సమీపంలోని…