టిడిపి , జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం విజయవాడ నోవాటెల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి తరఫున నారా లోకేష్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు , జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. రెండు పార్టీలు కలిసి భవిష్యత్ కార్యాచరణ పై మూడు గంటలు సుదీర్ఘంగా చర్చించారు. టిడిపి జనసేన పార్టీలవైపు సుమారు మూడు కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని వారందరిని పలకరిస్తూ రెండు పార్టీలు కలిసి భవిష్యత్ గ్యారెంటీ అనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి టిడిపి జనసేన మేనిఫెస్టో, కరపత్రాలను అందిస్తామంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు పేస్ టూ ఫేస్..
nara lokesh
టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చేసిన పని అని లోకేష్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఈ నకిలీ లెటర్ పై టీడీపీ కూడా మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే సీఎం జగన్ నైజమని టీడీపీ విమర్శించింది. ఒక సామాజికవర్గ ప్రజలకు విజ్ఞప్తి’ అంటూ చంద్రబాబు పేరుతో నకిలీ లేఖను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టింది. జగన్కు ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ నకిలీ లేఖ చెబుతోందని విమర్శించింది.
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీ తాత మీ నాన్నతో పాటు నేను రాజకీయం చేశాను.
మీ వంశ చరిత్ర మొత్తం తెలుసు నువ్వు నా గురించి మాట్లాడుతావా అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై మండిపడ్డారు. నిజ నిజాలు వాస్తవాలు తెలుసుకోకుండా జాతీయ నాయకుడు హోదాలో ఉండి తప్పుడు మాటలు మాట్లాడతావా? వాలంటీర్ పై అఘాయిత్యం నిజమని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నిజం నిరూపించకపోతే నీవు రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని నారా లోకేష్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also..
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపునకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు. కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు. పిచ్చికి వాడుతున్నట్టే, కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది రోగాల బారినపడ్డారని, 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని లోకేశ్ వెల్లడించారు. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతోందో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మందుబాబుల తిట్లు వినే ధైర్యం జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ చంద్రబాబు అరెస్టుకు ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును 50 రోజులుగా జైలుపాలు చేసి… పౌర సమాజానికి ఎంసందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయానికి నిరసనగా యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చిన నిజం గెలవాలి – కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా…లుగుదేశం పార్టీ కార్యాలయం బయట నిజం గెలవాలి న్యాయం జరగాలి అంటూ న్యాయదేవతకు వినతిపత్రం అందించారు. వినూత్న రీతిలో మోకాళ్ళ పైన నిలపడి న్యాయదేవత కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమయిందని, న్యాయాన్ని బ్రతికించి దుష్ట శిక్షణకు శ్రీకారం చుట్టే సమయం ఆసన్నమయిందని వేడుకున్నారు. అన్యాయం శిక్షింపబడాలని ఈ కార్యక్రమంలో న్యాయదేవతగా జిల్లా తెలుగుమహిళా అధికార ప్రతినిధి పేరం అనిత కుమారి, తెలుగు వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి కొత్తూరి వెంకట్, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి మేళం సైదయ్య, తెలుగుయువత విద్యార్థి నేతలు మహిళలు యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గున్నారు.
చంద్రబాబుపై కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు.. మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏంచేస్తున్నారని వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని అయితే ప్రత్యర్థిని చంపాలని చూడడం వైసీపీ నేతలకే చెల్లిందని ఆరోపించారు. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని లోకేశ్ గుర్తుచేశారు. కేసులతో ఎలాంటి సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. స్కాంలతో తమకు కానీ తమ పార్టీ నేతలకు కానీ బంధుమిత్రులకు కానీ ఎలాంటి సంబంధంలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉందని మీ దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా ప్రజల ముందు పెట్టాలని వైసీపీ నేతలకు లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు.
విజయదశమి రోజు తాము సమావేశం కావడం ఏపీకి మేలు చేస్తుందని నారా లోకేశ్ అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు వాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని విమర్శించారు. ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారన్న లోకేష్… వైసీపీ నేతల వేధింపులతో ముస్లింలు ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని లోకేశ్ అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలురకాలుగా వేధిస్తున్నారని మండిపడ్డారు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు ఏర్పాటైన టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సరికొత్త వ్యూహాలను ఖరారు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు రెండు పార్టీల కమిటీ నేతలు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు ఖరారు చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. నవంబర్ 1 నుండి నారా లోకేష్ బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్టు తట్టుకోలేక అసువులు బాసిన కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధమయ్యారని, రాబోయే రోజుల్లో జగన్ పాలను అంతమొందించడమే టిడిపి జనసేన ప్రధాన లక్ష్యమని టిడిపి జనసేన కలిసికట్టుగా వైసీపీని ఓడించి తీరుతామంటున్న టిడిపి మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్





Total views : 89982