పోలీస్ మరియు సెబ్ అధికారులు దోర్నాల మండలంలోని పెద్ద మంతనాల, పణుకుమడుగు, తిమ్మాపురం గ్రామాలలో ఉమ్మడి దాడులు చేసారు. అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ కోసం నిల్వ ఉంచిన 1900 లీటర్ల బెల్లపు ఊట మరియు నాటు సారా బట్టీలను ఇరువురు అధికారులు ధ్వంసం చేసారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిన్న, నేడు నాటు సారా బట్టీలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరిగాయి. సెబ్ అధికారులతో పాటు ఈ దాడుల్లో మార్కాపురం గ్రామీణ, పట్టణ, దోర్నాల ఎస్సైలు వెంకటేశ్వర నాయక్, కోటేశ్వరరావు, అంకమ్మ రావు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.
natu sara
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి ప్రత్తి గూడౌన్లో నాటుసారా తయారీ మెటీరియల్ ని నిన్న రాత్రి దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గూడెంలో ఉన్న సుమారు 260 బస్తాలు నల్లబెల్లం , స్పటికను, మూడు లీటర్ల నాటు సారాను దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంఘటన స్థలంలో గురజాల డిఎస్పి పల్లపురాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ ప్రత్తి గూడెంలో తనిఖీ చేయగా ఇందులో సుమారు 260 బస్తాల నల్ల బెల్లం మరియు స్పటిక ఉన్నదని , దీనితోపాటు మూడు లీటర్ల నాటుసార కూడా లభ్యమైనదని డిఎస్పి తెలిపారు. వీటి విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. దీని వెనక ఉన్న వ్యక్తి పరారీలో ఉన్నాడని , త్వరలోనే అరెస్ట్ చేసి శిక్షిస్తామని గురజాల డిఎస్పి పల్లపు రాజు తెలిపారు.
Read Also..
నిమ్మనపల్లి మండలంలోని పారేసు వారి పల్లెలో నాటు సారా తయారు చేస్తున్న 12 మందిని మదనపల్లి ఎస్ ఈ బి సీఐ శ్రీహరి రెడ్డి శుక్రవారం అరెస్టు చేశారు. ఒకేరోజు 12 మందిని అరెస్టు చేసి మరో పలువురిపై కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించారు. ఈ దాడులలో 3,500 లీటర్ల నాటు సారా తయారీకి ఉపయోగించే తుమ్మ చెక్క బెల్లపు ఊట, 60 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు.




Total views : 79808