అరటి తో అందాన్ని మరింత పెంచుకోవచ్చని విషయాలు చాలా మందికి తెలియదు. దీనితో చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. శరీరంపై ముఖంపై మచ్చలు అనేవి లేకుండా చేసుకోవచ్చు. జిడ్డు చర్మానికి చెక్ పెట్టవచ్చు మొటిమలు రాకుండా కాపాడుకోవచ్చు. అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం ద్వారా మీ యొక్క చర్మం అద్భుతంగా అందంగా తయారవడమే కాకుండా మృదువుగా ముడతలు పడకుండా ఉంటుంది. అదేవిధంగా యుక్త వయసులో ఉండే ఎవరైనా సరే ఈ అరటిపండు గుజ్జుని ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మొటిమలు లాంటివి రాకుండా చేసుకోవచ్చు. దీనిని తరచూ ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మీ శరీరం ఆయిల్ ఫేస్ అయితే కనుక తప్పనిసరిగా దాన్నుంచి బయటపడవచ్చు. మొటిమల సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పనిసరిగా అరటిపండుని గుజ్జుగా చేసి దానిలో ఒక అరటి స్పూన్ పసుపు వేసి వేప పువ్వుని కలిపి పేస్ట్ లా చేయడం ద్వారా దీనిని మోకానికి అప్లై చేసి ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే మొటిమల సమస్య నుంచి బయట పడవచ్చు. అదేవిధంగా జిడ్డు చర్మం సమస్యతో బాధపడే వారు కూడా అరటిపండు ముక్కకు చిన్న దోసకాయ ముక్క కలిపి వీటిని పేస్టులా చేసుకుని దీనిని మొఖానికి పట్టించడం ద్వారా జిడ్డు చర్మం సమస్య నుంచి బయటపడవచ్చు. తరచూ ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవడం ద్వారా ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా పోయి చర్మం అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది. కాబట్టి వారానికి ఒక్కరోజు దీనిని ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.
pimples
ఒక్క రోజులోనే మొటిమలను మాయం చేసే చక్కటీ చిట్కా సహజంగా కొన్ని రకాల మొటిమలు నొప్పిని కూడా కలుగ చేస్తాయి. మొటిమల వలన వచ్చే నొప్పి నుండి మరియు మొటిమల నుండి విముక్తి పొందడానికి చక్కటి చిట్కా. మొటిమలను కేవలం ఒక్క రోజులోనే నియంత్రించడానికి colgate toothpaste తీసుకోవాలి. ఈ కోల్గేట్ టూత్ పేస్ట్ ని రాత్రి పడుకునే ముందు మొటిమలు ఉన్న చోట మాత్రమే పెట్టాలి, ఉదయం లేవగానే చల్లటి నీటితో కడగాలి. ఇలా పెట్టిన వెంటనే చక్కటి ఉపశమనం పొందటమే కాకుండా pimples కూడా తొలగిపోతాయి.
పెసలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడతాయి. అనేక సౌందర్య సాధనాల్లో పచ్చ పెసలను వాడతారు. వీటితో ఇంట్లోనే మంచి మంచి ఫేస్ ప్యాక్‌లు వేసుకోవచ్చు. వీటి వల్ల మృదవైన, మెరిసే ముఖాన్ని పొందవచ్చు. ఇప్పుడు చెప్పుకోబోయే ఫేస్ ప్యాక్‌లు ఫాలో అయితే పొడిచర్మం, మొటిమలు, ఫేస్ మీద టాన్ ఇలాంటివేవీ ఉండవు. మొటిమలకు- మొటిమలు విరిగి చికాకు అనిపిస్తే, మొటిమలు వ్యాప్తి చెందడానికి కారణమైతే పచ్చి పెసలను రాత్రంతా పాలలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం గ్రైండ్ చేసి దానిపై ఒక చెంచా నెయ్యి పోసి ముఖానికి మర్దన చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం మొటిమలు లేకుండా మారుతుంది. వడదెబ్బ నుంచి బయటపడేందుకు పచ్చి పెసలు రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు మెత్తగా నూరి, చల్లటి పెరుగు, కీరదోసకాయ కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ముఖం తెల్లగా మృదువుగా మారుతుంది. ఫేస్ ప్యాక్- ఒక గుప్పెడు పచ్చి పెసల్లో పాలు పోసి రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బుకుని, ముఖం, మెడ, చేతులకు అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడానికి ముఖాన్ని పొడిగా ఉంచుకోవాలి. దీంతో మృదువైన, మెరిసే ముఖాన్ని పొందవచ్చు వెంట్రుకలు పెరగడం పచ్చి పెసరపిండిని మెత్తగా రుబ్బుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, పెరుగు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించండి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా పచ్చిపెసలను మీకు కావాల్సినట్లు వాడుకోవచ్చు. వీటివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అటు ఆరోగ్యానికి, ఇటు ముఖ సౌందర్యానికి పెసలు అద్భుతంగా పనిచేస్తాయి.





Total views : 78365