ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన ఎల్బీ స్టేడియంలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం కొలువుదీరింది.
Ponnam Prabhakar
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మరో 11 మంది చేత మంత్రులుగా గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో దామోదర్ రాజనర్సింహ ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా మిగిలిన వారందరూ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన సీతక్క, కొండా సురేఖలను సోనియాగాంధీ ఆప్యాయంగా హత్తుకుని, అభినందనలు తెలియజేశారు. మంత్రులకు శాఖలను కేటాయించాల్సి ఉంది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారిని పొన్నం ప్రభాకర్ దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆరు గ్యారెంటీల అమలుపై సంతకం చేసి, అఫిడవిట్ తో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై మేనిఫెస్టోను పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ కు మెడికల్ కళాశాల రాబోతోందని, హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలను పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్లు ఇస్తామని, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలోని కాలువల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపిస్తామన్నారు. రాష్ట్రంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ లో ఎన్నికలు ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ .. కరీంనగర్ లో డిపాజిట్ కూడా రాణి వ్యక్తి ఇవ్వాళ మాట్లాడు తున్నాడు. అక్కడ నాలుగు సార్లు ఓడిపోయిండు కానీ ఇక్కడికి వచ్చి గెలుస్తా గెలుస్తా అని ఎగురుతాండూ. ఇక్కడికి వచ్చి కులరాజకీయాలు చేస్తున్నాడు. గతంలో ఆయన పై ఉద్యమంలో పెప్పర్ స్ప్రే జరిగింది. దాంతో మూర్ఛ వచ్చి పడిపోయాడు అప్పటి నుండి కోల్పోయి ఏవేవోమాటలు మాట్లాడుతున్నాడు అంటూ పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన బిఆరెస్ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్.
Read Also..
హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పై పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే పడినప్పటి నుండి ఏదేదో మాట్లాడుతున్నాడని, ఆయన ఆస్పత్రిలో చూపించుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ కు చాలా అన్యాయం జరిగిందని అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, ఎవరికి ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో పెప్పేర్ స్ప్రే పడ్డ తర్వాత పొన్నం ప్రభాకర్ ను బయటికి తీసుకు వచ్చారని, అయన బయటికి వచ్చిన తర్వాతే తెలంగాణ బిల్లు పాస్ అయిందన్నారు. దానికి ఆయన కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందంటూ పొన్నం ప్రభాకర్ ప్రగల్బలు పలుకుతున్నాడని ఎద్దేవ చేశారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలో మిషన్ కాకతీయ ద్వారా 465 చెరువులను అభివృద్ధి చేశామని దాంతో హుస్నాబాద్ లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా నమ్మకుండా బిఆర్ఎస్ కే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read Also..