నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాచకొండ SOT పోలీసులు అరెస్ట్ చేసారు. రాజస్థాన్ నుండి తీసుకుని వచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూస్తున్నారని ఓపియం డ్రగ్ 3.4 కేజీలు , 45 గ్రాముల పాపి స్ట్రాప్ పౌడర్ ను స్వాధీనం చేసుకుని, 2.8 లక్షల నగదును సీజ్ చేసామని వారు తెలిపారు. ఈ ముఠాలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన SOT అరెస్ట్ చేసారు. శశిపాల్ బిష్ నాయ్, మదనలాల్ బిష్ నాయ్ లను అరెస్ట్ చేయగా శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని పోలీసులు తెలిపారు. బస్ ద్వారా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెస్తున్నారని, డ్రగ్స్ ను నిర్ములించడానికి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నమని వారు పేర్కొన్నారు.
Rajasthan
2012 నాటి ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరహాలో రాజస్థాన్‌లో మరో దారుణం వెలుగుచూసింది. కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం జరిగింది. కాన్పూర్ నుంచి జైపూర్ వెళుతున్న బస్సులో ఓ బాలికపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫూల్‌చంద్ మీనా మీడియాకు వెల్లడించారు. జైపూర్‌లోని తన మామయ్య ఇంటికి వెళ్లేందుకు రాత్రి సమయంలో బాలిక బస్సు ఎక్కింది. సీటు దొరక్కపోవడంతో బస్సు క్యాబిన్లో కూర్చుంది. క్యాబిన్లో కూర్చున్న కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయాక డ్రైవర్లు ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంతులవారీగా ఆమెపై అత్యాచారం చేశారని ఫూల్‌చంద్ మీనా వివరించారు.
దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా పలు చోట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండులుగా కురిసిన అకాల వర్షాలతో గుజరాత్ అతలాకుతలమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడి సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌పై బస్సు పడిపోవడంతో 4 మంది మృతి, 34 మంది గాయపడ్డారు.
రాజస్థాన్‌లోని దౌస జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి వెళుతున్న బస్సు అదుపు కోల్పోయి కింద ఉన్న రైలు పట్టాలపై పడటంతో నలుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో ఈ దారుణం జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన స్థానిక అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో తీవ్రంగా గాయపడిన 28 మందిలో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించామని అదనపు జిల్లా కలెక్టర్ రాజ్‌కుమార్ కస్వా వెల్లడించారు.





Total views : 62039