అన్నమయ్య జిల్లా రాయచోటిలోని గండి చెరువు, మాండవ్య నదులను పరిశీలించారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. ఆక్రమణల తొలగింపు, ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దాదాపు 2 కోట్ల రూపాయల నిధులతో చెక్ డ్యాముల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. కంచాలమ్మ గండి నుంచి వచ్చే నీరు వృధా అవకుండా చర్యలు తీసుకున్నామని..అలాగే బోరుబావుల్లో భూగర్భ జలాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న రెండేళ్లలో నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీరు నింపి..ప్రతి ఇంటికి, ప్రతి ఎకరాకు నీరందించే బాధ్యత తీసుకుంటామన్నారు.
Tag: