రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంత నీటి ప్రయోజనాలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సరైన అనుమతులు, ప్రణాళిక లేకుండా చేపట్టడం వల్ల ప్రజాధనం వృథా అయిందని విమర్శించారు. 34.3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం ద్వారా ఆశించిన ప్రయోజనం సాధించలేదని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం జరగకుండా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమ రైతుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
Tag: