రాజకీయాలలో ఆర్యవైశ్యులకు.. సముచిత ప్రాధాన్యత కల్పిస్తాం- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చిరస్మరణీయమైన సేవలు అందించిన మాజీ అర్ధిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోణిజేటి రోశయ్య వర్థంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రోశయ్య సూచనలతో రాజకీయాలపై తాను అవగాహన పెంచుకున్నానని అన్నారు. ఆయనను ఎదిరిస్తూ తాను శాసనమండలిలో మాట్లాడానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి సీఎంగా ఎవరున్నా రోశయ్యకు నెంబర్ 2 పొజిషన్ పర్మినెంట్‌గా ఉండేదని అన్నారు. తనకు పదవి కావాలని ఎవరినీ ఏనాడు ఆయన అడగలేదన్నారు. ఆయనకు ఉన్న ప్రతిభ, క్రమశిక్షణే వల్లే వివిధ హోదాలు దక్కాయని సీఎం అన్నారు. చట్టసభల్లో రోశయ్య బలమైన ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి