Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Telangana రాష్ట్రానికి సీఎంగా ఎవరున్నా రోశయ్య పొజిషన్ పర్మినెంట్‌

రాష్ట్రానికి సీఎంగా ఎవరున్నా రోశయ్య పొజిషన్ పర్మినెంట్‌

by Rama
రాష్ట్రానికి సీఎంగా ఎవరున్నా రోశయ్య పొజిషన్ పర్మినెంట్‌

రాజ‌కీయాల‌లో ఆర్య‌వైశ్యుల‌కు.. స‌ముచిత ప్రాధాన్య‌త క‌ల్పిస్తాం- ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. అలాగే ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల‌కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన సేవ‌లు అందించిన మాజీ అర్ధిక మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, దివంగ‌త కొణిజేటి రోశ‌య్య విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ లో ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కోణిజేటి రోశయ్య వర్థంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రోశయ్య సూచనలతో రాజకీయాలపై తాను అవగాహన పెంచుకున్నానని అన్నారు. ఆయనను ఎదిరిస్తూ తాను శాసనమండలిలో మాట్లాడానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి సీఎంగా ఎవరున్నా రోశయ్యకు నెంబర్ 2 పొజిషన్ పర్మినెంట్‌గా ఉండేదని అన్నారు. తనకు పదవి కావాలని ఎవరినీ ఏనాడు ఆయన అడగలేదన్నారు. ఆయనకు ఉన్న ప్రతిభ, క్రమశిక్షణే వల్లే వివిధ హోదాలు దక్కాయని సీఎం అన్నారు. చట్టసభల్లో రోశయ్య బలమైన ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: