పవిత్ర రంజాన్ మాసంలో ఇవాళ చివరి శుక్రవారం. ముస్లింలు జరుపుకునే జమ్మాత్-ఉల్-విదా ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చారిత్రాత్మక మక్కా మసీదుతో పాటు సికింద్రాబాద్‌లోని జామా మసీదు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు ప్రకటించారు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. చార్మినార్ నుంచి మదీనా, ముర్గీ చౌక్, శాలిబండ వైపు వెళ్లే ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేస్తున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు. నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. శాలిబండ, నాగులచింత వైపు నుంచి వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద హరిబౌలి వైపు పంపిస్తారు. చౌక్ మైదాన్ ఖాన్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కోట్లా అలీజా వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అఫ్జల్‌గంజ్ బస్టాప్ వద్దే నిలిపివేయనున్నారు. ప్రార్థనల కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం సౌత్ జోన్ పరిధిలో ఆరు చోట్ల ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అదేవిధంగా, సికింద్రాబాద్‌లోని జామా మసీదు వద్ద కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సుభాష్ రోడ్డును మూసివేసి, రాణిగంజ్, ప్యారడైజ్ వైపు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. జమ్మాత్-ఉల్-విదా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
#hyderabad
హైదరాబాద్ టోలీచౌకీలో ఘోర ప్రమాదం.. భవనంపై నుండి పడి ముగ్గురు కార్మికులు మృతి.
హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక ఐదు అంతస్తుల భవనంపై పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టోలిచౌకి పరిధిలోని ఒక నిర్మాణ సైట్లో కార్మికులు ఐదో అంతస్తుపై సెంట్రింగ్ లేదా ఇతర నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పట్టుతప్పి ఐదో అంతస్తు నుండి కింద పడిపోయారు. ఈ ప్రమాద తీవ్రతకు ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన తోటి కార్మికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. భవన నిర్మాణ సమయంలో కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ప్రమాదానికి భవన యజమాని లేదా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
జీఎస్టీ వసూళ్ళలో తెలంగాణ దూకుడు ప్రదర్శించింది. 2026 ఫిబ్రవరి నెలలో ఏకంగా రూ. 4,125 కోట్ల GST వసూళ్లను సాధించింది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 14% వృద్ధిని నమోదు చేయడం విశేషం. దేశంలోని ఇతర అగ్రగామి రాష్ట్రాలతో పోటీ పడుతూ రాష్ట్రం రెండంకెల వృద్ధిని సాధించడం వెనుక ఉన్న ప్రధాన కారణం హైదరాబాద్ వంటి అంతర్జాతీయ స్థాయి నగరం.. అలాగే దాని చుట్టూ విస్తరించిన ఐటీ, ఫార్మా, మరియు సేవా రంగాలు అని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగాల నుండి వస్తున్న పన్ను ఆదాయం రాష్ట్ర ఖజానాకు వెన్నెముకగా నిలుస్తోంది. ఐటీ ఎగుమతులు పెరగడం, కొత్తగా మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ కార్యాలయాలను ఇక్కడ ప్రారంభించడం వల్ల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం సమకూరుతోంది.
మరోవైపు ప్రజల కొనుగోలు శక్తి పెరగడం వల్ల రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరగడం, కొత్త వెంచర్లు మరియు అపార్ట్మెంట్ల నిర్మాణాలు పెరగడంతో అనుబంధ రంగాలైన సిమెంట్, స్టీల్ మరియు హార్డ్‌వేర్ అమ్మకాలు కూడా పెరిగి GST వసూళ్లు భారీగా పెరిగాయి. దీనికి తోడు, తెలంగాణ ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ పన్ను ఎగవేతను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ, డేటా అనలిటిక్స్ ద్వారా పన్ను చెల్లింపులను పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. డిజిటల్ లావాదేవీలు ప్రాచుర్యంలోకి రావడం వల్ల చిరు వ్యాపారుల నుండి పెద్ద కంపెనీల వరకు పన్ను పరిధిలోకి రావడం రాష్ట్ర ఆదాయానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ అదనపు ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఒరిజినల్ సిటీ అయిన ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ను త్వరగా పట్టాలు ఎక్కించడానికి సంబంధించిన స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దాదాపు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల ఎంజీబీఎస్ – చంద్రాయణ్ గుట్ట మార్గంలో భూసేకరణ పనులు ముమ్మరమయ్యాయి. భూసేకరణ చట్టానికి లోబడి ఈ ప్రభావిత 11 వందల ఆస్తులకు గాను.. ఇప్పటికే 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్ ని జిల్లా కలెక్టర్ కి సమర్పించామని.. వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను దఫదఫాలుగా కలెక్టర్ జారీ చేసారని.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నోటిఫై చేసిన ఆస్తులలో 4 వందల ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ ను కలెక్టర్ జారీ చేయడం పూర్తయ్యిందన్నారు. 2 వందల ప్రభావిత ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డులను ఈ నెలాఖరులోగా ప్రకటించడం పూర్తవుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తదనంతరం వెంటనే వాటికి పరిహారం చెల్లించి వాటిని కూల్చే పనులు ప్రారంభం అవుతాయని.. తద్వారా మెట్రో రైల్ మార్గ నిర్మాణాన్ని సుగమం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్ లోని పబ్బుల నిర్వాహకులు.. కాసుల సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. తమ కస్టమర్ల నుంచి ఎలా డబ్బులు దండుకోవాలనే దానిపై ఉన్న ధ్యాస వారికి అందించే సేవలపై మాత్రం ఉండటం లేదు. పబ్బుల్లో అందించే ఆహార ఉత్పత్తులు కస్టమర్లను అనారోగ్యం పాలు చేస్తోంది. సరదా కోసం పబ్బులకు వెళ్లే వారు ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి నెలకొంటోంది. నిబంధనలు భేఖాతరు చేస్తూ నిర్వహిస్తున్న పబ్బులపై అధికారులు ఎన్ని దాడులు వారిలో మాత్రం మార్పు రావడం లేదు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పలు పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బుల్లోని వంట గదులకు వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. కిచెన్ రూంలో మొత్తం అపరిశుభ్రతతో పాటు బొద్దింకలను చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులు సైతం అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బులపై అధికారులు కేసులు నమోదు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టయిన నటుడు అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత కాసేపటికే రూ. 50 వేల పూచీకత్తుతో హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే, కోర్టు ఆర్డర్ కాపీ జైలుకు చేరడం ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ రాతంత్రా జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఆర్డర్ కాపీలు రాగానే, అప్పటికే ఆయన న్యాయవాదులు సిద్ధం చేసి ఉంచిన ష్యూరిటీ బాండ్లను సమర్పించారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. దోమలగూడ లోని అరవింద్ కాలనీలో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి రంజిత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముందుగా కత్తులు, తుపాకులతో ఇంట్లోకి చొరబడిన పది మంది దొంగలు కుటుంబ సభ్యులను బంధించారు. అనంతరం లాకర్ లో భద్రపరిచిన 2.5 కిలోల బంగారం, కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా అపహరించుకుపోయారు. అదేవిధంగా చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా సీసీ టీవీ డీవీఆర్ ను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. కాగా దొంగల దాడిలో ఇంటి యజమాని రంజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది. నగర రహదారులపై నైట్రోజన్ డయాక్సైడ్ అత్యధికంగా విడుదలవుతోంది. వాహనాల నుంచి వెలువడే పొగ, ఇంధన వనరుల వినియోగం, ట్రాఫిక్ రద్దీ కారణంగా నగరంలోని గాలిలో ఎన్ఓ2 అత్యధికంగా విడుదలవుతోందని గ్రీన్ పీస్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం గాలిలో ఎన్ 2 వార్షిక సగటు సాంద్రత క్యూబిక్ మీటర్ కు 10 మైక్రో గ్రాములకు మించి ఉండకూడదు.. కానీ గతేడాది నగరంలోని 14 వాయు నాణ్యత మానిటరింగ్ స్టేషన్లలో 9 ప్రాంతాలలో డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే కాలుష్యం అధికంగా ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజకీయాలలో ఆర్యవైశ్యులకు.. సముచిత ప్రాధాన్యత కల్పిస్తాం- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చిరస్మరణీయమైన సేవలు అందించిన మాజీ అర్ధిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోణిజేటి రోశయ్య వర్థంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లో రోశయ్య సూచనలతో రాజకీయాలపై తాను అవగాహన పెంచుకున్నానని అన్నారు. ఆయనను ఎదిరిస్తూ తాను శాసనమండలిలో మాట్లాడానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి సీఎంగా ఎవరున్నా రోశయ్యకు నెంబర్ 2 పొజిషన్ పర్మినెంట్‌గా ఉండేదని అన్నారు. తనకు పదవి కావాలని ఎవరినీ ఏనాడు ఆయన అడగలేదన్నారు. ఆయనకు ఉన్న ప్రతిభ, క్రమశిక్షణే వల్లే వివిధ హోదాలు దక్కాయని సీఎం అన్నారు. చట్టసభల్లో రోశయ్య బలమైన ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించింది. ఉదయం సరిగ్గా 7గంటల27 నిమిషాలకు అందరూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న వేళ భూమి కొన్ని సెకన్లపాటు కంపించింది. దీంతో భయపడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. దీని కేంద్రం ములుగులో భూమికి 40 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించారు. దీని ప్రభావం మాత్రం 225 కిలోమీటర్ల మేర విస్తరించింది.
హైదరాబాద్ పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాలతోపాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలోనూ ప్రకంపనలు కనిపించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్టణం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Total views : 140790